కుక్కకాటుకు చెప్పుదెబ్బ

pakistani-websites-hacked-by-indian-hackers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భారత్ సత్తాను తక్కువ అంచనా వేస్తున్న పాకిస్థాన్ కు ఆ దేశ ఇండిపెండెన్స్ డే రోజే మన హ్యాకర్లు షేకిచ్చారు. ఎందుకంటే ఎప్పుడూ మన వెబ్ సైట్లు, మన ప్రభుత్వ వెబ్ సైట్లు అన్నింటినీ హ్యాక్ చేసి దొంగ దెబ్బ తీస్తూ ఉన్నారు . ఇప్పటిదాకా ఉపేక్షించిన భారత్ సర్కారు.. ఇప్పటికీ అలాగే ఉంది. కానీ ఈసారి మాత్రం తామే పూనుకుని బుద్ధి చెప్పారు.

ఇప్పుడు పాకిస్థాన్ లో మెయిన్ వెబ్ సైట్లన్నీ హ్యాకయ్యాయి. వాళ్ల దేశానికి బదులు మన దేశ జెండా ఎగురుతోంది. దీంతో పాక్ మథనపడుతోంది. ఇలా ఎలా జరిగిందని చర్చోపచర్చలు చేస్తోంది. భారత్ తలుచుకుంటే ఏ దేశ వెబ్ సైట్లైనా హ్యాక్ చేయగలదని నిరూపించడానికే ఇలాంటి పనిచేసినట్లు హ్యాకర్లు చెబుతున్నారు.

కానీ ఇంత చిన్న ఘటనతో బుద్ధి వస్తే అది పాకిస్థాన్ ఎందుకవుతుంది. అందుకే ఏదో చేయాలని తపనపడుతూనే ఉంది. ప్రతిసారీ మనకు చికాకు కలిగిస్తున్న చైనా హ్యాకర్లకు బుద్ధి రావాలంటే.. వాళ్ల దేశ వెబ్ సైట్ల పని కూడా పట్టాలని హ్యాకర్లను జనం కోరుతున్నారు.

మరిన్ని వార్తలు:

కిమ్ దూకుడుకు తగ్గిన ట్రంప్