Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో షెడ్యూల్ ఉందని, వారణాసిలో ఆ షెడ్యూల్ చిత్రీకరణ జరపాల్సి ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. లండన్‌లో ప్రతిష్టాత్మక ఎక్సలెన్స్ అవార్డును దక్కించుకున్న పవన్ తాజాగా హైదరాబాద్ చేరుకున్నాడు. త్వరలోనే చిత్ర యూనిట్ సభ్యులతో పవన్ వారణాసి బయలుజేరనున్నాడు.
ఫారిన్ షెడ్యూల్‌తో పూర్తి అవుతుందనుకున్న సినిమాను మళ్లీ ఇంకా ఎందుకు వారణాసిలో చిత్రీకరిస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా అనుకున్నదాని ప్రకారం కాకుండా ఈ షెడ్యూల్ అదనంగా చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో పవన్‌తో పాటు చిత్ర ముఖ్య తారాగాణం అంతా కూడా పాల్గొనబోతున్నారు. ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత పవన్ లండన్ వెళ్లాడు. ఆ సమయంలో హైదరాబాద్‌లో పవన్ లేకుండా కొన్ని సన్నివేశాలను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించడం జరిగింది.
ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి సినిమాను విడుదల చేసి తీరుతామని దర్శకుడు త్రివిక్రమ్ చెబుతున్నాడు. ఈనెల చివర్లో సినిమా నుండి రెండవ పాటను విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా ముద్దుగుమ్మలు కీర్తి సురేష్ మరియు అను ఎమాన్యూల్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌తో భారీగా బిజినెస్ చేస్తోంది. తెలుగు సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటూ పవన్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. టాప్ 5లో ఈ చిత్రం స్థానం దక్కించుకుంటుందనే నమ్మకంను నిర్మాత కూడా వ్యక్తం చేస్తున్నాడు.