Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నైజీరియన్ డ్రగ్స్ ముఠా కేసులో అరెస్ట్ అయిన లేడీ డాన్ సంగీత నోరు విప్పుతున్న కొద్దీ హైదరాబాద్ లో పెద్దింటి వాళ్ళుండే జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలు షేక్ అవుతున్నాయి. ఇంతగా పెద్దింటి వాళ్ళని వణికిస్తున్న ఆ లేడీ డాన్ నేపధ్యం కూడా షాక్ కి గురి చేస్తోంది. ఈమె అసలు పేరు పాలపర్తి సంగీత. విజయవాడలో ఓ కాల్ సెంటర్ లో పనిచేసేది. పెళ్లి అయిన ఆరు నెలలకే ఆమె భర్త చనిపోయాడు. ఆ తర్వాత సంగీతకి ఫేస్ బుక్ ద్వారా సుడాన్ కి చెందిన ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. ఆ సూడాన్ అమ్మాయి ద్వారా నైజీరియా కి చెందిన ఓజుకి కాస్మోస్, అతని స్నేహితులు ఫ్రెండ్స్ అయ్యారు. వారి మాటలు కి పడిపోయిన సంగీత విజయవాడ నుంచి హైదరాబాద్ కి మకాం మార్చింది.
రాజేంద్ర నగర్ వద్ద బండ్లగూడ లోని సన్ సిటీ లో ఓ ఇల్లు అద్దెకి తీసుకున్న సంగీత ఆ నైజీరియన్ లతో కలిసి ఉండసాగింది. వారు తెచ్చిన డ్రగ్స్ ని తన ప్రియుడితో కలిసి నగర శివార్లలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులకి సరఫరా చేయడం, కొందరికి అమ్మాయిలని కూడా సమకూర్చడం చేసింది. ఆ కాలేజీ లో చదివే పెద్దింటి కుర్రోళ్ళు చాలా మంది సంగీత వలలో పడి ఆమె చెప్పినట్టు ఆడే పరిస్థితికి చేరుకున్నారు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతుంటే ఆ పెద్దింటి కుర్రోళ్ళ గుట్టుమట్లన్నీ బయటపెడుతోందట సంగీత. అవి బయటికి వస్తే తమ పరువు పోతుందని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. మొత్తానికి సంగీత దెబ్బకి జూబిలీహిల్స్, బంజారా హిల్స్ షేక్ అవుతున్నాయి.
మరిన్ని వార్తలు: