Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన పోర్న్ చిత్రం ఎంతటి సంచలనం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో పోర్న్ చిత్రం తెరకెక్కించడం నేరం. కాని వర్మ తెలివిగా విదేశాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. దాంతో ఆ కేసు నుండి తప్పించుకున్నాడు. అయితే సినిమా ప్రమోషన్ సమయంలో ఒక మహిళపై వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఆయన్ను ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాయి. ఆయన జైలుకు వెళ్లే పరిస్థితిని తీసుకు వచ్చాయి. వర్మ ఇప్పటికే సీసీఎస్ పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. పీకల్లోతు కష్టాల్లో ఉన్న వర్మకు తోడుగా కీరవాణి కూడా అదే బురదలో పడ్డాడు.
జీఎస్టీ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను కీరవాణి అందించిన విషయం తెల్సిందే. ఒక అద్బుతమైన నేపథ్య సంగీతంను కీరవాణి ఇచ్చాడు అని, తప్పకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ వినాల్సిందిగా వర్మ గతంలో చెప్పుకొచ్చాడు. ఇక వర్మ విచారణ సందర్బంగా జీఎస్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని విచారించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే కీరవాణిని కూడా విచారించేందుకు సీసీఎస్ పోలీసులు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే కీరవాణికి నోటీసులు వెళ్లాయి అంటూ ప్రచారం జరుగుతుంది. కీరవాణి మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా ఉన్నాడు. ఈ కేసులో కీరవాణిపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అని, వర్మకే ఎక్కువ ప్రభావం పడనున్నట్లుగా మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మొత్తానికి పోర్న్ చిత్రంకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించినందుకు కీరవాణికి కూడా ఆ బురద అంటింది.