తెలుగు బిగ్‌బాస్ రెండవ సీజన్ ఆసక్తికరంగా సాగుతూ వస్తుంది. వారాలు పూర్తి అవుతున్నా కొద్ది, ఒక్కొక్కరు వెళ్లి పోతున్న సమయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూ వస్తుంది. ఇంటి సభ్యుల్లో తేజస్వి, దీప్తి సునయన, గీతామాధురి, బాబు గోగినేని ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వీరు షోకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా బిగ్‌బాస్‌ను ఇంటి సభ్యులు అంతా కూడా గౌరవంగా పిలుస్తూ, ఏ సమస్య వచ్చినా కూడా ఆయనతో చెబుతూ ఉంటారు. ప్రతి విషయంలో లోతుగా అద్యయనం చేసి, ఆ సమస్య గురించి పరిష్కారంకు ప్రయత్నాలు చేసే వ్యక్తి బాబు గోగినేని. ఈయన త్వరలోనే బిగ్‌బాస్ ఇంటికి వదిలి వెళ్లే సమయం వచ్చిందంటూ ప్రచారం జరుగుతుంది.
బిగ్‌బాస్ సీజన్ 2 ప్రారంభం అయిన కొన్ని రోజుల్లోనే బాబు గోగినేనిపై పోలీసు కేసు మోదు అయ్యింది. దేశ ద్రోహం కేసుతో పాటు, ఆధార్ వివరాలను బహిర్ఘతం చేసిన కేసులో బాబు గోగినేనిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. బాబు గోగినేనిని విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసులు నోటీసు ఇచ్చారని, బిగ్‌బాస్‌ను వారం రోజుల్లో తమకు అప్పగించాలని, విచారణకు హాజరు పర్చాలి అంటూ పోలీసులు ఆదేశించారు. దాంతో ప్రస్తుతం బిగ్‌బాస్ నిర్వాహకులు మళ్లగుళ్లాలు పడుతున్నారు. బిగ్‌బాస్ ఇంటి నుండి మొదటి సీజన్ సమయంలో ముమైత్ బయటకు వెళ్లి, విచారణ ఎదుర్కొని మళ్లీ ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా బిగ్‌బాస్ ఇంటి నుండి నేరుగా బాబు గోగినేనిని విచారణకు తీసుకు వెళ్లి, అక్కడ నుండి మళ్లీ బిగ్‌బాస్ ఇంటికి తీసుకు రావాలని భావిస్తున్నారు. అయితే విచారణ ఒక్క రోజు అయితే పర్వాలేదు. కాని ఎక్కువ రోజులు అయితే ఎలా అంటూ షో నిర్వాహకులు ఆలోచనలో పడ్డారు. మొత్తానికి బిగ్గర్ బాస్‌కు బిగ్ షాక్ తప్పేలా లేదు.