Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Political Strategist Prashant Kishor May Work For YSRCP Party
వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం కోసం తపిస్తున్న జగన్.. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ట్రై చేస్తున్నారు. ఓవైపు పార్టీని బలోపేతం చేస్తూ.. మరోవైపు వలస నేతల్ని ప్రోత్సహిస్తూ.. ఇంకోవైపు ప్రశాంత్ కిషోర్ సేవలు కూడా ఉపయోగించుకుంటున్నారు.
గతంలో మోడీకి, నితీష్ కు అధికారం తెచ్చిపెట్టిన ప్రశాంత్ కిషోర్.. తనకూ అదృష్టం వరించేలా చేస్తారని జగన్ నమ్ముతున్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ తొలి సర్వేనే షాకివ్వడంతో.. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా నేతలపై ప్రశాంత్ కిషోర్ రిపోర్టులు చూసి జగన్ అవాక్కయ్యారట.
ఏపీలో పొలిటికల్ మేనేజర్లు కొత్త. ఇలాంటి వారి సూచనలు, సలహాలు స్వీకరించడానికి నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండరు. దీంతో ప్రశాంత్ టీమ్ కు, క్యాడర్ కు సమన్వయం చేయలేక జగన్ తల ప్రాణం తోకకు వస్తుందట. కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా పరిస్థితి తయారైంది.
మరిన్ని వార్తలు: