మీ టూ: నాలుక తిరగేసిన ప్రకాష్‌ రాజ్‌…!

Prakash Raj Supports Metoo Arjun Sruthi Hariharan

మీ టూ ఉద్యమం ప్రస్తుతం సినీ రంగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా తీవ్ర రూపం దాల్చింది. కన్నడ హీరోయిన్‌ శృతి స్టార్‌ హీరో అర్జున్‌పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. శృతి ఆరోపణలకు గాను ప్రకాష్‌ రాజ్‌, శ్రద్దా శ్రీనాద్‌, చేతన్‌, కవితలు శృతికి మద్దతు తెలిపారు. కాగా మరికొందరు అర్జున్‌పై ఆరోపణలను కొట్టిపారేశారు. తాజాగా కన్నడ సీనియర్‌ నటుడు అంబరీష్‌ అర్జున్‌, శృతికి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు కానీ రాజీకి ఈ ఇద్దరు కూడా అంగీకరించలేదు. తనపై వచ్చిన ఆరోపణలను అవాస్తవాలు అని న్యాయపరంగా నిరూపించుకుంటాను అని అర్జున్‌ గట్టి పంతంతో ఉన్నాడు. ఈ విషయంలో శృతి కూడా అర్జున్‌తో రాజీకి ఒప్పుకోవడం లేదు.

Sruthi-Hariharan

మొదట శృతికి మద్దతు తెలిపిన బహుభాషా నటుడు ప్రకాష్‌ రాజ్‌ ప్రస్తుతం నాలుక తిరగేశాడు. అర్జున్‌ బహిరంగంగా శృతికి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్‌ చేసిన ప్రకాష్‌ రాజ్‌ తానెప్పుడు అర్జున్‌ను నిందితుడిగా చూడలేదని, తామిద్దరం మంచి స్నేహితులం, సహ నటులం, చాలా కాలం నుండి ఇద్దరం ఒకరికి ఒకరం తెలుసు, ఈ విషయంలో నేను అర్జున్‌కు గాని, శృతికి గాని మద్దతు తెలుపలేదు అంటూ మాట మార్చేశాడు. అర్జున్‌ అలా చేశాడని తాను అనుకోవడం లేదు అంటూ నాలుక తిరగేశాడు. ప్రకాష్‌ రాజ్‌ ఈ వ్యాఖ్యలకు గాను కన్నడ సినీ పరిశ్రమలో ఈ వివాదం మరింత హాట్‌గా మారింది.

arjun