Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలు ఎప్పటికీ ఆసక్తికరమే. ఇటీవల కన్నుమూసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సంతానం తానే అంటూ ఎందరో ప్రకటించుకున్నారు. ఒకతను అయితే ఇదే విషయం మీద కోర్టు దాకా వెళ్లి చీవాట్లు కూడా పెట్టించుకున్నాడు. ఇలా బహిరంగ ప్రకటనలు చేసే వారిని జనం నమ్మినా నమ్మకపోయినా ఇప్పటికీ జయకి సంతానం ఉందని నమ్మేవాళ్ళకి కొదవలేదు. అందులో నిజానిజాలు ఏమిటో ఎవరికీ తెలియదు . ఇప్పుడు మరో సెలబ్రిటీ జీవితం గురించి కూడా ఇలాంటి విషయం ఒకటి బయటికి వచ్చింది. ఆ ప్రముఖుడు మరెవరో కాదు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ. ఆయన తన తండ్రి అంటూ ఓ 48 ఏళ్ల మహిళ ప్రకటించుకోవడం సంచలనం రేపుతోంది.
రియలిస్టిక్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన మధుర్ బండార్కర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా “ఇందు సర్కార్ “. దివంగత నాయకురాలు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితంలోని ముఖ్య ఘట్టాలు ముఖ్యంగా ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని హైలైట్ చేస్తూ తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో కీలక క్యారెక్టర్ ఇందిరా చిన్న కుమారుడు సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ టైం లో ఆయన ఆరాచకాలని ఇందు సర్కార్ లో బాగా చూపిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ సినిమా వెనుక బీజేపీ పెద్దలు వున్నారని కాంగ్రెస్ కూడా ఆరోపిస్తోంది. ఇంతలో ప్రియాసింగ్ పాల్ అనే 48 ఏళ్ల మహిళ మీడియా ముందుకు వచ్చారు. ఇందు సర్కార్ సినిమాలో తన తండ్రి సంజయ్ గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీ గురించి తప్పుగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆ సినిమాలో 30 శాతం నిజాలు, 70 శాతం అబద్ధాలు ఉన్నాయని ఆమె చెప్పడమే కాదు దర్శకుడు మధుర్ భండార్కర్ కి లీగల్ నోటీసులు కూడా పంపారన్నారు.
ఇందు సర్కార్ సినిమా కన్నా తాను సంజయ్ గాంధీ కుమార్తె అని చెప్పడం ద్వారా ప్రియపాల్ సింగ్ సంచలనం రేపారు. పెళ్ళికాకముందు సంజయ్ గాంధీ తనకు జన్మ ఇచ్చినట్టు ఆమె చెప్పుకున్నారు. తన పెంపుడు తల్లితండ్రులు ఈ విషయం తనకు చెప్పారని ఆమె వివరించారు. అయితే సంజయ్ గాంధీ విషయం చెప్పిన ఆమె తల్లి గురించి మాత్రం బయటికి చెప్పలేదు. నిజానికి సంజయ్, మేనకాని వివాహం చేసుకున్న విషయం వారికి వరుణ్ గాంధీ అనే సంతానం వున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రియపాల్ సింగ్ ప్రకటనతో సంజయ్ ప్రతిష్ట పెరగడం మాట అటుంచి ఆయన మీద ఇంకో మచ్చ పడింది. ఈ వ్యవహారం మీద మేనకాగాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని వార్తలు