మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ వ్’ చిత్రంలోని మాణిక్య మలరాయ పాటతో ప్రియా వారియర్ దేశ వ్యాప్తంగా స్టార్ అయిన విషయం తెల్సిందే. ప్రియా వారియర్ ఆ పాటలో కన్న గీటడంతో పాటు, ముద్దు గన్ను పేళ్చడం వంటివి చేయడంతో దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఈసమయంలోనే కొందరు ముస్లీంలు ఒరు అదార్ లవ్ చిత్రంపై కేసులు పెట్టడం జరిగింది. ముస్లీంల మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమా పాట ఉంది అంటూ తెలంగాణలో కొందరు ముస్లీంలు కేసు నమోదు చేశారు. కేవలం తెంగాణలోనే కాకుండా పలు ప్రాంతంలో కూడా కేసులు నమోదు అయ్యాయి.
ఆ కేసులన్నింటిని కూడా సుప్రీం కోర్టులో విచారించాలంటూ ప్రియావారియర్ తరపు న్యాయవాది కోరడం జరిగింది. సుదీర్ఘ కాలంగా ఈ కేసు విచారణ జరుగుతుంది. తెలంగాణతో పలు ప్రాంతాల్లో ప్రియా వారిపై నమోదు అయిన కేసులు కొట్టి వేయాలంటూ సుప్రీం కోర్టు తాజాగా తీర్పును ఇవ్వడం జరిగింది. కేసులు పెట్టిన వారిపై సుప్రీం కోర్టు ఆగ్రహంను వ్యక్తం చేసింది. హీరోయిన్ ప్రియా వారియర్ మరియు దర్శకుడు ఒమర్ లాలూపై పెట్టిన కేసులు అన్ని కూడా ఎత్తి వేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వీరు ఊపిరి పీల్చుకున్నారు. సినిమాలో ఎవరో ఏదో పాట పాడారని పిటీషన్ వేయడం ఏంటని పిటీషనర్‌పై మరియు పిటీషనర్ తరపు న్యాయవాదిపైగా సుప్రీం కోర్టు అక్షింతలు వేసినట్లుగా తెలుస్తోంది.