Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లో ఒక హీరోయిన్గా నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ ఒక పాటలో కన్నుగీటి, ముద్దుగన్ను పేళ్చి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కేవలం కొన్ని రోజుల్లోనే ఆమెకు దేశ వ్యాప్తంగా సంచలన రీతిలో క్రేజ్ పెరిగింది. బాబోయ్ అనిపించేలా ఈ అమ్మడిని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు అయిదు పది లక్షల పారితోషికం కూడా కష్టమే అనుకున్న ఈమెకు ఏకంగా రెండు మూడు కోట్ల పారితోషికం కూడా దక్కుతుంది. ఇక ఈ అమ్మడు కన్ను గీటడంతో ఏస్థాయి గుర్తింపు తెచ్చుకుందో ఈ సంఘటనతో తేలిపోయింది.
క్రికెట్ దేవుడిగా దేశ వ్యాప్తంగా క్రీడా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్‌ను ఈమె కలుసుకునే అవకాశం దక్కించుకుంది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కొచ్చి వచ్చిన సచిన్ టెండూల్కర్‌ను ఒరు అదార్ లవ్ యూనిట్ తరపున ప్రియా వారియర్ కలుసుకుంది. సచిన్‌తో ఫొటో దిగడంతో ఆమె ఆనందానికి అవదులు లేవు. సచిన్ కూడా ప్రియా వారియర్‌తో సరదాగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ గురించి, ఆమె హావభావాల గురించి కూడా సచిన్ కొద్ది సమయం మాట్లాడినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి తన కన్నుసైగ కారణంగా ఏకంగా క్రికెట్ దేవుడినే కలుసుకునే అవకాశం దక్కించుకున్న ప్రియా వారియర్ ఈ దశాబ్దపు లక్కీ గర్ల్ అంటూ సినీ విశ్లేషకులు, ఇంకా ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.