Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రియా వారియర్ ప్రస్తుతం ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఓవర్ నైట్‌లో ఆల్ ఇండియా స్టార్ అయిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువ క్రేజ్‌ను దక్కించుకుంది. మలయాళ చిత్రం ‘ఒరు అడార్ వ్’లోని ఒక పాట విడుదల అయిన తర్వాత ప్రియా వారియర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ పాటలో ప్రియా కన్ను గీటడం మరియు కనుబొమ్మలు ఎగురవేయడంతో అంతా కూడా ఫిదా అయ్యారు. తాజాగా విడుదలైన టీజర్లో ముద్దు గన్ పేల్చి మరోసారి సంచలనం అయ్యింది. కేవలం ఈమె క్రేజ్ సౌత్‌లోనే అనుకుంటే పొరపాటే. సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా ప్రియా వారియర్‌కు విపరీతమైన క్రేజ్ దక్కింది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో గత నాలుగు సంవత్సరాలుగా సన్నీలియోన్ గురించి అత్యధికంగా సెర్చ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కంటే కూడా అధికంగా సన్నీలియోన్ గురించి వెదుకుతున్నారు. ఇప్పుడు సన్నీలియోన్ స్థానంను ప్రియా వారియర్ బ్రేక్ చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే నాలుగు సంవత్సరాల రికార్డును బ్రేక్ చేసింది. సన్నీలియోన్ కంటే కూడా అధికంగా ప్రియా వారియర్‌ను గూగుల్ చేస్తున్నారు. ఈ నాలుగు రోజుల్లో కొన్ని కోట్ల మంది ప్రియా వారియర్ కోసం గూగుల్‌ను ఆశ్రయించారట. ఈ విషయం స్వయంగా గూగుల్ ఇండియా ప్రకటించింది. ఒక సెలబ్రెటీకి ఓవర్ నైట్‌లో ఇంతగా ప్రాచుర్యం పొందడం అనేది గతంలో ఎప్పుడు ఇంతగా జరిగింది లేదు. సోషల్ మీడియాలో కూడా ప్రియా వారియర్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగా పెరిగింది. మొత్తానికి ప్రియా వారియర్ స్టార్ ఆఫ్ ది ఇండియాగా పేరు తెచ్చుకుంది.