Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ ఇటీవల తన 102వ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం సందర్బంగా రామోజీ ఫిల్మ్ సిటీలో తన సహాయకుడిపై చేయి చేసుకున్న విషయం తెల్సిందే. ఆ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలయ్య ఇలా చేయి చేసుకోవడం ఇదే ప్రథమం ఏమీ కాదు. గతంలో అభిమానులపై, తన వ్యక్తిగత సిబ్బందిపై చేయి చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా కూడా బాలయ్య తన పద్దతిని మార్చుకోకుండా అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన సంఘటనతో బాలయ్యపై విమర్శల వర్షం కురుస్తుంది.
ఇప్పటికే బాలయ్య తీరును అభిమానులు కూడా తప్పుబడుతున్నారు. బాలయ్య ప్రవర్తనపై ఒక అభిమాని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అన్నా రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా.. అంటూ ఆ వ్యక్తి ఒక బహిరంగ లేఖను బాలకృష్ణకు రాయడం జరిగింది. ఆ లేఖలో దోరల కాలం పోయి చాలా సంవత్సరాలు అయ్యింది, మీరు ఇంకా దొరల మాదిరిగా ఫీల్ అవ్వమాకండి, పొగరు దరి చేరితే మీ కల విలువ పడిపోతుంది. మీపై ఎవరు ఆధార పడి బతకడం లేదు. మీరే ప్రేక్షకులపై ఆధారపడి బతకుతున్నారు. మీరు ఇప్పుడు వీఐపీ, రేపు ప్రేక్షకులు సినిమాను బహిష్కరిస్తే మీ వీఐపీ నుండి ఒక అక్షరం పోతుంది. ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. సంస్కారంతో ప్రవర్తించండి అంటూ అతడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం జరిగింది. మరి బాలయ్య ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉంటాడా అనేది చూడాలి.
మరిన్ని వార్తలు:
వీరిద్దరు ప్రేక్షకుల హృదయాలను గెల్చుకున్నారు
ఇకపై అలా చేయను
మంచు ఫిక్స్ అయ్యాడు