Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు చూసాక ఒక్క వైసీపీ శ్రేణులే కాదు రాజకీయ విశ్లేషకులు కూడా షాక్ తిన్నారు. 2014 లో అధికారం రాకపోయినప్పటికీ బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ గడిచిన మూడున్నర ఏళ్లలో ఇంకాస్త బలం పుంజుకుని ఉంటుందని అంతా భావించారు. కానీ జరిగింది వేరు. ఫలితాలు అంతకంతకు దిగజారుతున్న వైసీపీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కానీ అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఇప్పటికీ వైసీపీ కి క్యాడర్ బలం వుంది. ఓ విధంగా చెప్పుకోవాలంటే జగన్ కి వచ్చినంత జనం ఇంకే నాయకుడికి వచ్చే పరిస్థితి లేదు. అయినా వైసీపీ ఘోర పరాజయం చెందడానికి కారణం ఏమిటా అని జగన్ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట. పార్టీ నేతలు, విశ్లేషకులు చేస్తున్న వాదనలు ఆయనకి అంతగా నచ్చడం లేదట. ఈ పరిస్థితుల్లో పులివెందుల నుంచి వచ్చిన ఓ ఛోటా నాయకుడు జగన్ కళ్ళు తెరిపించాడట.
నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత దిగాలు పడిన జగన్ ని పలకరించడానికి పులివెందులకు చెందిన ఓ ఛోటా నాయకుడు లోటస్ పాండ్ కి వచ్చారట. జగన్ తో మాట్లాడుతూ పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలు అంటూ పెద్దగా లేవు, వున్నది ఒకటే సమస్య అని చెప్పారట. అదేమిటని అడిగితే ఇప్పుడు మీతో మాట్లాడడానికి బయట ఉన్న ఆఫీస్ సిబ్బందికి చేతులు తడపాల్సి వచ్చింది, అంతకుముందు అది తెలియక మీతో మాట్లాడడానికి వచ్చి ఊరికే వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అని చెప్పారట. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ మధ్యలో ఉన్న నాయకుల వల్ల జగన్ కి క్షేత్ర స్థాయి నేతలతో సంబంధం లేకుండా పోవడమే ఏ ఎన్నికలో అయినా ఓటమికి కారణమని చెప్పారట సదరు పులివెందుల నేత. దీంతో షాక్ అయిన జగన్ ఇకపై అలా జరక్కుండా చూసుకుంటానని మాటిచ్చారట.
మరిన్ని వార్తలు: