దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా గ్యాంగ్ రేప్-మర్డర్ కేసుపై ఇవాళ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. జూన్ 3న కేసు విచారణ పూర్తికావడంతో సోమవారం తీర్పువెల్లడించి పఠాన్‌కోట్ కోర్టు. ఏడుగురు నిందితుల్లో ఆరుగురుని దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది. వీరిలో ప్రధాన నిందితుడు సాంజిరామ్‌తో పాటు ముగ్గురు పోలీసులు, గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. ఆరుగురు దోషుల్లో ఆలయ పూజారి సాంఝీరామ్, అతడి మేనల్లుడు పర్వేష్ కుమార్, దీపక్ ఖజూరియాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇక హంతకులకు సహకరించి.. సాక్షాలను తారుమారు చేసిన ముగ్గురు పోలీసులు ఆనంద్ దత్త, తిలక్ రాజ్, సురేంద్ర వర్మకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది. ఐతే పఠాన్‌కోట్ కోర్టు ఖరారుచేసిన శిక్షలపై బాధిత కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. తమ చిన్నారిని పాశవికంగా హత్యచేసిన కిరాతకులను నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్లాలని యోచిస్తున్నారు. 2018 జనవరి 10న ఈ చిన్నారి గుర్రాలను మేపడానికి వెళ్లి అదృశ్యమైంది. దాంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం గాలిస్తుండగా సరిగ్గా వారం రోజుల తర్వాత గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహం లభ్యమైంది. ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారం జరిగిందని అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. భూవివాదమే ఈ చిన్నారికి హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. రాసానా గ్రామంలో బక్రవాల్ అనే సంచార తెగ వారు ఉంటారు. వారి రవాణాకు వినియోగించే గుర్రాలను గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి మేపుతుంటారు. ఐతే తమ పొలాల్లో అనుమతి లేకుండా గుర్రాలను మేపుతున్నారని కొందరు గ్రామస్థులు వారితో గొడవపెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలకు గొడవలు తలెత్తాయి. దాంతో బక్రవాల్ తెగపై కక్ష పెంచుకున్న ఆలయ పూజారి సాంజీ రామ్ ఏలాగైనా వారిని గ్రామం నుంచి తరిమేయాలని పథకం రచించాడు. దాన్ని పక్కాగా అమలు చేశారు. ఆమె గుర్రాలను మేపేందుకు గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్లింది చిన్నారి. విషయం తెలిసి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్లారు. బాలికను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ దేవాలయంలో బంధించారు. గుళ్లో ఆ చిన్నారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత మరొకరుగా ఆమె మీద తమ పశవాంఛను తీర్చుకున్నారు. అనంతరం రాయితో చిన్నారిని కొట్టి చంపి అడవిలో విసిరేశారు. వారం తర్వాత చిన్నారి డెడ్‌బాడీ దొరకడంతో నిందితులు అప్రమత్తమయ్యారు. ఇక దరాప్తు ఏడాదిన్నర పాటు జరిగి ఇప్పుడు కోర్టు తీరు వెలువరించింది.