Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తాజాగా తన కొడుకు ఆకాష్‌తో ‘మెహబూబా’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న పూరి జగన్నాధ్ పూర్తిగా లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. సినిమాపై నమ్మకంతో మరియు తన కొడుకును రిచ్‌గా లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ‘మెహబూబా’ను స్వయంగా తానే నిర్మించాడు. అందుకోసం తాను ఎంతగానే ఆశపడి కొనుగోలు చేసిన ఒక భారీ ఇల్లును కూడా అమ్మేశాడు. సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ అయితే అలాంటి ఇల్లులు రెండు తీసుకోవచ్చని ఆయన భావించాడు. కాని పరిస్థితి తారు మారు అయ్యింది. కొడుకుపై అభిమానం, మరియు తన దర్శకత్వంపై నమ్మకంతో పూరి ఏకంగా ఆ సినిమాకు 35 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా సమాచారం అందుతుంది.
‘మెహబూబా’ చిత్రం నిర్మాణం కోసం ఇల్లు అమ్మడంతో పాటు దాదాపు 15 కోట్ల మేరకు ఫైనాన్స్ తీసుకున్నాడు. ఆ మొత్తం ఇప్పుడు తిరిగి ఇవ్వాలి. కాని సినిమా చూస్తే కనీసం 5 కోట్లు కూడా వసూళ్లు చేసే పరిస్థితి లేదు. దాంతో పూరి జగన్నాధ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయాడు అంటూ టాక్ వినిపిస్తుంది. ఆయన ప్రస్తుతం ఉన్న ఇంటితో పాటు, ఆఫీస్‌ను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినది అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో భారీ పారితోషికం తీసుకునే టాప్ దర్శకుల్లో ఒక్కడిగా ఉన్న పూరి ఇప్పుడు సినిమా ఫ్లాప్‌తో మొత్తం తలకిందులు అయ్యింది. ఆకాష్‌తో మరో సినిమాను నిర్మించాలని భావించిన పూరి ఇప్పుడు చేసిన అప్పులు ఎలా తీర్చాలా అని తల పట్టుకున్నాడు.