అవి పెట్టుకోడానికి పిచ్చోడినా, భయం కాదు జాలి!

lawrence-responds-on-sri-reddy-comments

నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంటూ కొన్నాళ్ళు తెలుగు సినీ ఇండస్ట్రీ మీద హడావిడి చేసి ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మీద పడిన సంగతి తెలిసిందే. అయితే తమిళ ఇండస్ట్రీకి సంబందించిన లారెన్స్, శ్రీకాంత్, సి సుందర్ లాంటి వారి మీద పలు ఆరోపణలు కూడా చేసింది. అయితే తనపై చేసిన అలిగేషన్స్ విషయంలో లారెన్స్ స్పందించారు. “శ్రీరెడ్డి ఆరోపణలను గురించి అంతా నన్ను అడుగుతున్నారు .. అదే పనిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దాంతో ఈ వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నాను. లారెన్స్ పోస్ట్ యధాతదంగా శ్రీరెడ్డి ఆరోపణలలో ఎంతమాత్రం వాస్తవం లేదు. ‘రెబల్’ సినిమా సమయంలో ఆమె నన్ను కలిసింది, ఆ సినిమా వచ్చి దాదాపు ఏడేళ్లు అయింది ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటె ఇంతవరకూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఆ సమయంలో హోటల్లోని నా రూములో దేవుళ్ల ఫోటోలు, రుద్రాక్ష మాలలు ఉన్నాయని చెప్పింది. హోటల్ రూమ్ లో అవన్నీ పెట్టుకోవడానికి నేనేమైనా పిచ్చివాడినా?

శ్రీరెడ్డి తన టాలెంట్ ను నిరూపించుకుంటే అవకాశం ఇవ్వడానికి నేను సిద్ధంగా వున్నాను. ఆమె పరిస్థితి పట్ల నేను జాలి పడుతున్నానే గానీ .. భయపడటం లేదు” అంటూ స్పష్టం చేశాడు. అలాగే ఆమె మోసపోయానని చేబుతోంది కాబట్టి ఆమెని ప్రెస్ మీట్ కి ఆహ్వానిస్తానని ఆమె వచ్చి మీడియా ముందు అంటే దానర్థం నేనేదో కష్టమైన స్టెప్స్ ఇస్తానని కాదని చాలా సింపుల్ స్టెప్స్, డైలాగ్స్ ఇస్తానని అవి కూడా నటులకు ఉండాల్సిన బేసిక్ క్వాలిటీకి సంబంధించినవి మాత్రమే. నిజంగా టాలెంటెడ్ అయితే నా ఎదుట, ప్రెస్ ఎదుట అవి చేసి చూపించు. నిజంగా నువ్వు బెస్ట్ యాక్టర్‌వి అని నేను ఫీల్ అయితే ఓ డైరెక్టర్‌గా ప్రెస్ ఎదుట నా నెక్ట్స్ మూవీలో నీకో మంచి క్యారెక్టర్ ఇచ్చేందుకు సైన్ చేసి.. అడ్వాన్స్ ఇస్తాను. అలాగే నేను నీకు భయపడి ఈ రిప్లై ఇవ్వట్లేదు నేను మహిళలకు చాలా గౌరవం ఇస్తాను అందుకే నా తల్లికి గుడికట్టి అది మహిళలకు డెడికేట్ చేశాను. మంచి మాట్లాడుకుందాం.. మంచి పనులు చేద్దాం. నీకు మంచి జీవితం లభించాలని నేను ప్రార్థిస్తాను’’ అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసారు
.