Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ వైపు బీజేపీ తో స్నేహం… ఇంకో వైపు తల్లి కాంగ్రెస్ తో సంబంధం కొనసాగిస్తూనే వుంది వైసీపీ. ఈ లోగుట్టు నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో ఇంకోసారి బయటపడింది. నంద్యాల ఉప ఎన్నికల బరిలోకి దిగుతామని కొందరు కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ముగ్గురు పట్టుబట్టారు. అయితే అక్కడ పోటీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెబుతూ వచ్చారు. అటు కర్నూల్ జిల్లా రాజకీయాల్లో దిగ్గజం లాంటి కోట్ల కుటుంబానికి చెందిన సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పోటీ చేయాల్సిందే అని చెప్పినప్పటికీ రఘు వీరా పట్టించుకోలేదు. కానీ టికెట్ కోసం పట్టుబట్టిన వారిని, పోటీ గురించి ఒత్తిడి చేసిన వారికి మాట మాత్రం చెప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేస్తున్నారు.అయితే ఈ తాజా ఎపిసోడ్ లో రఘువీరా రెడ్డి యాక్షన్ వెనుక వున్నది జగన్ ప్లాన్ అన్న మాట వినిపిస్తోంది. అదెలాగో చూద్దామా…
నంద్యాల నియోజకవర్గంలో మైనారిటీ ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. నియోజకవర్గంలో ఆ వర్గానికి చెందిన ఫారూఖ్ సహా ఇతర మైనారిటీ నాయకుల్లో ఎక్కువమంది టీడీపీ వైపే వున్నారు. ఉప ఎన్నికల్లో ఆ వర్గం ఓట్లని ఆకట్టుకోడానికి వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అందులో ముఖ్యమైంది నేషనల్ విద్యాసంస్థలకు చెందిన ఇంతియాజ్ అహ్మద్ ని పార్టీలోకి రప్పించడానికి వైసీపీ నాయకులు కాళ్ళకి బలపాలు చుట్టుకుని మరీ తిరిగారు. జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి మొదలుకుని వైసీపీ అగ్రనేతలంతా ఆయన ఇంటికి వచ్చి వెళ్లారు. శిల్పా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. అయితే అభ్యుదయ భావాలు మెండుగా వుండే ఇంతియాజ్ ఆ ప్రతిపాదనలకు మొగ్గలేదు. ఇటు టీడీపీ వైపు నుంచి మంత్రి సోమిరెడ్డి చేసిన ప్రయత్నం ఫలించి ఇంతియాజ్ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు. దీంతో ఓటమి భయం పట్టుకున్న జగన్ మైనారిటీ ఓట్లలో చీలిక కోసం కాంగ్రెస్ తరపున ఆ వర్గం అభ్యర్థిని నిలబెట్టాలని తన వేగుల ద్వారా రఘువీరా కి చెప్పడం, ఆయన ఓకే చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. అందుకే రేపు ఆ పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ ఖాదర్ నామినేషన్ వేయబోతున్నారు.
మరిన్ని వార్తలు: