సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా కొన్నాళ్ల పాటే ఆ స్టార్‌డం కొనసాగుతుంది. ఆ తర్వాత సాదా సీదా పాత్రతో కాలం వెళ్లబుచ్చాల్సిందే. కొందరికి అయితే ఆ సాదా సీదా పాత్రలు కూడా దక్కవు. అందుకే హీరోయిన్‌గా వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అంటారు. సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు ఏం జరుగబోతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆందోళనతో కాలం వెళ్లదీస్తూ ఉంటారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అలా కాదట. తనకు రేపటి గురించి భయం లేదని, అసలు ఆ ఆలోచన తనకు ఎప్పుడు రాదు అంటూ చెప్పుకొచ్చింది.
తాజాగా భవిష్యత్తు గురించి రకుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. రేపటి శ్వాసను కూడా నేడే పీల్చేయలేం కదా, అలాగే రేపటి గురించి నేడే ఎందుకు ఆలోచించాలి అంటూ రకుల్ ప్రశ్నిస్తోంది. అందుకే నేను నేడు చేయాల్సిన పనుల గురించి మాత్రమే ఆలోచిస్తాను అని, అలా ఆలోచించినప్పుడు మాత్రమే జీవితం హాయిగా సాగిపోతుందని చెప్పుకొచ్చింది. రేపటి గురించి ఆలోచన, ఆందోళన, భయం పెట్టుకుంటే నేడు చేస్తున్న పనిని శ్రద్దతో చేయలేం, అందువల్ల వచ్చిన అవకాశాలు కూడా మిస్ అవుతాం అంటూ వేదాంతం దోరణితో ఈ అమ్మడు మాట్లాడటం చర్చనీయాంశం అవుతుంది. నా ఆత్మవిశ్వాసం నాకు శ్రీరామ రక్ష అని, తాను ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తాను అని, రేపటి గురించి ఆందోళన చెందకుండా హాయిగా జీవిస్తాను అంటూ రకుల్ జీవిత సత్యంను చెప్పింది. అంతా కూడా రకుల్ మార్గంను అవంభిస్తే తప్పకుండా మంచి జీవితంను పొందవచ్చు అనిపిస్తుంది.