ఎన్టీ రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ చిత్రం రెండు పార్ట్‌లు సంక్రాంతి మరియు రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే స్టార్ కాస్టింగ్ భారీగా ఉంది. ఇంత భారీ స్టార్ కాస్టింగ్‌తో సినిమా రూపొందుతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది. ఇక ఎన్టీఆర్ సినీ జీవితంను చూపించాల్సిన నేపథ్యంలో శ్రీదేవి పాత్రను తప్పనిసరిగా చూపించాల్సిందే. అందుకే ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో చేయించేందుకు దర్శకుడు క్రిష్ సిద్దం అయ్యాడు.
ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ చిత్రాల్లో ఒకటి ‘వేటగాడు’. ఆ చిత్రంలో శ్రీదేవితో ఆకు చాటు పిందె తడిసే పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికి కూడా ఆ పాట గురించి చర్చించుకుంటూనే ఉంటారు. అందుకే ఆ పాటను ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో రీమిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం క్రిష్ ఏర్పాట్లు చేస్తున్నాడు. బాలకృష్ణ, రకుల్‌ల కాంబినేషన్‌లో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో చిత్రీకరించబోతున్నారు. ఈ పాటను కీరవాణి రీమిక్స్ చేయబోతున్నాడు. రెండున్నర నిమిషాల పాటు ఈ పాట ఉంటుందని, పాత ఫ్లేవర్ మిస్ కాకుండా కొత్తగా ఈ పాటను ట్యూన్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో అంటే ఎన్టీఆర్ మొదటి పార్ట్‌లో ఈ పాట ఉండబోతుంది.