మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ చిత్రంను చేస్తున్న విషయం తెల్సిందే. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ గత నెల రోజులుగా అజర్ బైజాన్ అనే ప్రాంతంలో జరుపుకుంటుంది. భారీ ఎత్తున అక్కడ యాక్షన్ సన్నివేశాలు మరియు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ అక్కడ చిత్రీకరణ జరుపుకోలేదని సమాచారం అందుతుంది. మొదటి సారి చరణ్ మూవీ అక్కడ చిత్రీకరణ జరుపుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అక్కడ చిత్రీకరణ పూర్తి అవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యారు.
చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ఇండియాకు చేరుకున్న నేపత్యంలో రామ్ చరణ్ మాత్రం జార్జియా వెళ్లినట్లుగా సమాచారం అందుతుంది. అక్కడ ప్రస్తుతం ‘సైరా’ చిత్రీకరణ జరుగుతుంది. చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’కు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. అందుకే అక్కడ కొన్ని రోజులు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను చూసుకోబోతున్నాడు. భారీ ఎత్తున ఈ చిత్రం షూటింగ్‌ను అక్కడ నిర్వహిస్తున్నారు. దాదాపు 30 కోట్లతో అక్కడ యుద్ద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి రామ్ చరణ్ చాలా ప్లాన్డ్‌గా తన సినీ కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటూ, నిర్మాణంలో కూడా సత్తా చాటుతూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు. చరణ్ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుండగా, చిరంజీవి సైరా మూవీ మాత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.