రామ్ చరణ్ సినిమాలో హీరోగా నటిస్తూనే సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి నటించిన ఖైది నెంబర్ 150వ చిత్రాని కొణిదెల ప్రొడక్షన్ పైన నిర్మించి మంచి వసూళ్లను రాబట్టాడు. అలాగే చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రాని కూడా కొణిదెల ప్రొడక్షన్ పైన అత్యంత భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నాడు. ఓ వైపు సినిమా హీరో గా తన పారితోషకం ను పెంచుకుంటూ వెళ్ళుతున్నాడు. ప్రస్తుతం రామ్ నటిస్తున్నా చిత్రం వినయ విధేయ రామ ఈ చిత్రంకు చరణ్ 18 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడు. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ మల్టీ స్టారర్ చిత్రానికి 18 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడు.
ఈ రెండు చిత్రాలకు నిర్మాత ఒక్కరే అతనే డివివి దానయ్య. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు చరణ్ తీసుకున్నా పారితోషకం మొత్తం ను దానయ్య తో ఓ డీల్ కుదురించుకొని. ఆ మొత్తం అమౌంట్ ను ఆర్ ఆర్ ఆర్ కు ఇన్వెస్ట్మెంట్ గా పెడుతున్నాడు. రాజమౌళి సినిమా కాబట్టి సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయి. చరణ్ తీసుకున్నా పారితోషకం కన్న ఎక్కువగానే కలెక్షన్స్ రూపంలో అమౌంట్ తిరిగివస్తుంది. చరణ్ కు నిర్మాణ రంగంలో మంచి తెలివి తేటలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ ప్రస్తుతం వినయ విధేయ రామ ఓ సాంగ్ చిత్రకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలవుతుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.