టీటీడీ వర్సెస్ రమణ దీక్షితులు వివాదం రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతోంది. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తితో కలిసి ప్రెస్‌మీట్ పెట్టడం టీటీడీ వర్గాల్లోనే కాదు… శ్రీవారి భక్తుల్లోనూ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తమయింది. జగన్‌ను కలిసి మాట్లాడినా ప్రతిపక్ష నేత అని కొంత మంది సర్దుకు పోయి రమణదీక్షితులను సమర్థించారు కానీ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి విషయంలో ఎవరూ ఆయనను వెనకేసుకొచ్చేందుకు సిద్ధపడటం లేదు. కారణం… బోరుగడ్డ అనిల్ బ్యాక్‌గ్రౌండ్. ఏకంగా హోంమంత్రి పేరు చెప్పుకుని ‘భూ సెటిల్మెంట్లు’ చేసినట్లు అనిల్‌పై కేసులున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ స్టేషన్‌లో అనిల్‌పై రౌడీ షీట్ కూడా ఉంది. దీంతో గత రెండు రోజుల నుండి రమణ దీక్షితులు మీద విమర్శలు వేల్లువేతడంతో ఆయన ఒక సేల్ఫీ విడుదల చేసారు.
అందులో శ్రీవారి ఆభరణాల విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన ఆయన… అర్చకుల భోజనాల విషయంలోనూ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మరలా ఆరోపించారు. ఇంతకు ముందు మీడియా సమావేశం నిర్వహించినప్పుడు నా వెనుక ఉన్నదెవరో తెలీదని, ‘ఆ సమయంలో తన వెనుక అనిల్ అనే వ్యక్తి ఉన్నాడని… అన్య మతస్థుడని టీవీ ఛాన్సల్ ప్రచారం చేశాయి. నా డిమాండ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఈ అంశానికి ప్రాధాన్యమిచ్చారంటూ ఛానెళ్ల మీద అసహనం వ్యక్తం చేసారు. మీడియా సమావేశానికి ముందు అనిల్ అనే వ్యక్తి వచ్చి ఈ విషయంలో పిల్ వేయాలని అనుకుంటున్నామని చెప్పాడు. దీంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడానికి నేను సమ్మతించాను. అంతకు ముందు ఆయన్నెప్పుడూ నేను కలవలేదని రమణ దీక్షితులు తెలిపారు.
ఎవరో వ్యక్తి తన వెనుక ఉంటె రాద్దాంతం చేసిన మీడియా తిరుమలలో అర్చకుల భోజనాల విషయం పట్టించుకున్నారా..? అని ఆయన మీడియా మీద అసహనం వ్యక్తం చేసారు. ఈ విషయం పదేపదే టీటీడీ అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. శ్రీవారి ఆలయాన్ని పరిరక్షించే ఈ యజ్ఞంలో మీరంతా నాకు అండగా నిలవాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన కేవలం మీడియాను దుమ్మేత్తిపోసేందుకే ప్రాధన్యమిస్తునట్టు అర్ధం అవుతోంది. ఆయన బయటకి వచ్చిన నాటి ఉంది నుండి ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అండగా నిలిచినా మీడియా మేడే ఆయన ఇప్పుడు అలక లాంటి ధోరణి అవలంబిస్తుడం గమనించాల్సిన విషయం. ఎందుకంటే మీడియా అంటే అన్ని విషయాలు కవర్ చేయాలి, నేటి సమాజ పోకడకి దగ్గరగా ఇప్పటి మీడియా మంచి కంటే వివాదాలకే ప్రాధాన్యం ఇస్తోంది, నిజానికి అలా మంచికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తే అసలు రామ దీక్షితులు దగ్గరకి అసలు మీడియా వెళ్ళేది కాదేమో ?. వైసీపీకి అనిల్ కీ సంబంధాలు బయట పడటం వల్లే ఇప్పుడు రమణ దీక్షితులతో ఇలా మాట్లాడిస్తున్నారని విస్కేషకులు భావిస్తున్నారు.