రంగస్థలం…తెలుగు బులెట్ రివ్యూ

Rangasthalam Movie Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నటీనటులు : రామ్ చరణ్ , సమంత,అనసూయ,
నిర్మాతలు :   Y.నవీన్,Y.రవిశంకర్ ,C. V. మోహన్ 
దర్శకత్వం :     సుకుమార్
సినిమాటోగ్రఫీ:  రత్నవేలు
ఎడిటర్ :  నావిన్ నూలి
మ్యూజిక్ :  దేవిశ్రీప్రసాద్

ఇకపై సినిమాల్లో కొత్తగా ఏదైనా చేయాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిసైడ్ అయ్యింది ధ్రువ సినిమాతో. ఆ సినిమా సక్సెస్ చూసాక ఇక ఆ దారి కరెక్ట్ అని నిర్ణయం తీసుకున్నాక చేసిన సినిమా రంగస్థలం. సుకుమార్ దర్శకుడు అనుకోగానే ఏ సినిమా చేస్తాడబ్బా అని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే ఆ అంచనాలకి భిన్నంగా 1985 ల నాటి కథని ఓకే చేసి చరణ్ , సుక్కు తొలి షాక్ ఇచ్చారు. ఇక చరణ్ గెట్ అప్ బయటకు వచ్చాక ఇంకో షాక్. ఈ సినిమాలో కొత్త చరణ్ ని చూస్తామని ఆయన ఫాన్స్ తో పాటు సగటు తెలుగు ప్రేక్షకుడు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ తరుణంలో విడుదల అయిన రంగస్థలం ఎలా వుందో చూద్దాం.

కథ…

రంగస్థలం అనే ఊరిలో అందరికీ తలలో నాలుకలా వుండే చిట్టిబాబు ( చరణ్ ) కి ఇతరులు చెప్పే మాటలు వినబడవు. అయితే ఎదుటివాళ్ళ పెదవుల కదలిక ఆధారంగా వాళ్ళు ఏమి అంటున్నారో అర్ధం చేసుకుంటుంటాడు. చిట్టిబాబు , రామలక్ష్మి ( సమంత ) ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ కథ కొనసాగుతుండగానే ఆ ఊరి రాజకీయాల మీద పట్టుకోసం ప్రయత్నం చేస్తున్న కుమార్ ( అది ) కి చిట్టిబాబు మద్దతుగా నిలుస్తాడు. ఆ ఇద్దరు కలిసి ఎన్నో ఏళ్లుగా ఊరి సర్పంచ్ ( జగపతిబాబు ) ని ఓడించేందుకు నడుం కడతారు. అయితే అక్కడ నుంచే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. గ్రామ రాజకీయంలో చిక్కుకున్న చిట్టిబాబు కి అనూహ్య పరిణామాలు ఎదురు అవుతాయి. అవేంటి ? చివరకు చిట్టిబాబు , రామలక్ష్మి ప్రేమ కథ ఏమయ్యింది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ …

దర్శకుడు సుకుమార్ కొత్త కొత్త పాయింట్స్ తో సినిమాలు తీస్తుంటాడు గానీ రంగస్థలం ని ఎంచుకున్నప్పుడు పాత రోజులకి వెళ్లి ఏమి చేస్తాడు అన్న డౌట్ చాలా మందికి వచ్చింది. అయితే ఈ కమ్యూనికేషన్ విప్లవం రోజుల నుంచి పాత రోజులకి వెళ్లడం లోనే ఓ కిక్ ఉందని సినిమా మొదలైన కొద్దిసేపటికే అర్ధం అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో రంగస్థలాన్ని చూస్తున్నంతసేపు ఇంత మంచి కాలాన్ని మిస్ అయ్యామా , ఇలాంటి పల్లెల్ని మిస్ అయ్యామా అని అనిపిస్తుంది. ఆ పల్లె అందాల మధ్య రాజకీయ రాక్షసి ఆడే ఆటలు , అందులో నలిగిపోయే అమాయకుల గురించి సుక్కు చాలా బాగా చూపించాడు.
ఇక చరణ్ విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో అతను ఓ స్టార్ గా కన్నా ఓ నటుడుగా మనకు కనిపిస్తాడు. గెట్ అప్ ఒక్కటే కాదు నటన , బాడీ లాంగ్వేజ్ …ఇలా అన్ని విషయాల్లో చరణ్ సరికొత్తగా కనిపిస్తాడు. చిట్టిబాబు తెర మీద తిరుగుతున్నట్టు ఉంటుంది కానీ చరణ్ పెద్దగా కనిపించడు. ఇక చరణ్ ఒక్కడే గాకుండా లీడ్ రోల్స్ చేసిన వాళ్లంతా అదరగొట్టారు.

సినిమా ఫస్ట్ హాఫ్ లో వినోదానికి కొదవలేదు. అయితే సెకండ్ హాఫ్ లో డ్రామా , ఎన్నికలకు సంబంధించిన సీన్స్ చూస్తున్నప్పుడు కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక ఒకటిరెండు సీన్స్ , ఫైట్ సీక్వెన్సెస్ మరీ మొరటుగా అనిపిస్తాయి.సెకండ్ హాఫ్ సెంటిమెంట్ సీన్స్ చూస్తుంటే ఏదో ఆరవ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో ఈ కొద్దిపాటి మైనస్ లు లేకుండా ఉంటే ఈ సినిమా ఇంకో ఎత్తుకి వెళ్లి ఉండేది.ఇక రత్నవేలు ఫోటోగ్రఫీ , దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి మూలస్థంభాలు.

ప్లస్ పాయింట్స్ .

రంగస్థలం కథ
1980 ల నాటి వాతావరణం
చరణ్, సమంత , ఆది నటన
రత్నవేలు ఫోటోగ్రఫీ
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
ఓవర్ సెంటిమెంట్

తెలుగు బులెట్ పంచ్ లైన్…”రంగస్థలం “ మీద ఫ్లాష్ బ్యాక్ రోజులు.

తెలుగు బులెట్ రేటింగ్… 3 . 25 / 5 .