Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులకు సమ్మర్లో వినోదాన్ని అందించేందుకు వచ్చిన ‘రంగస్థలం’ మరియు ‘భరత్ అనే నేను’ చిత్రాలు భారీ విజయాలను దక్కించుకున్నాయి. బాహుబలి తర్వాత 200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలుగా ఈ రెండు రికార్డు సృష్టించాయి. రంగస్థలం చిత్రం నెల రోజులకు 200 కోట్ల క్లబ్లో చేరితే, భరత్ అనే నేను చిత్రం మాత్రం కేవలం రెండు వారాల్లోనే 200 కోట్ల క్లబ్లో చేరడం జరిగింది. లాంగ్ రన్లో రంగస్థలంతో పోల్చితే భరత్ అనే నేను 10 నుండి 15 కోట్ల మేరకు అధికంగా వసూళ్లు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కనిపించే నెంబర్ల ప్రకారం చూస్తే భరత్ అనే నేను చిత్రం రంగస్థలంపై పై చేయి సాధించినట్లుగా అనిపిస్తుంది. కాని కనిపించని లెక్కలు మాత్రం రంగస్థలం బెస్ట్ అంటూ అని నిరూపిస్తున్నాయి.
అధికారిక లెక్కల ప్రకారం రంగస్థలం చిత్రం కంటే భరత్ అనే నేను చిత్రం ఎక్కువ గ్రాస్ కలెక్షన్స్‌ను వసూళ్లు చేస్తున్నాయి. అయితే షేర్ కలెక్షన్స్‌లో మాత్రం రెండు చిత్రాలకు పెద్ద వ్యత్యాసం కనిపించడం లేదు. ఇక డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన లాభాలు మరియు నష్టాల లెక్కన చూస్తే రంగస్థలం చిత్రం చాలా బెటర్ అనిపిస్తుంది. భరత్ అనే నేను చిత్రంను భారీ రేటుకు కొనడం వల్ల పలువురు బయ్యర్లు ఇంకా బయట పడలేదు. కొద్దిగొప్ప నష్టాలు వారికి తప్పేలా లేవు. కాని రంగస్థలం చిత్రం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా ఇప్పటికే లాభాల బాటలో ఉన్నారు. ప్రతి ఒక్క బయ్యర్ కూడా వారి ఏరియా సామర్థ్యంను బట్టి లాభాలను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే భరత్‌పై చిట్టిబాబుది పై చేయి అంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు.