ఆంధ్రప్రదేశ్ లో ఘోరం వెలుగు చూసింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి కారులోనే అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించాడు దుర్మర్గుడు. అయితే ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని అకివీడులో జరిగింది. అది తెలుసుకున్న పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్కు చెందిన బాలిక ఏడాది కాలంగా ఆకివీడు మండలంలోని ఓ గ్రామంలో తన నాయనమ్మ ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాలిక కనిపించక పోవడంతో నాయనమ్మ ఆకివీడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.