Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి మీడియా ముందుకు వచ్చాడు. ఇటీవలే ఈయన ‘ఆఫీసర్’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి చేత అనుచిత వ్యాఖ్యలు చేయించిన కారణంగా వర్మను బ్యాన్ చేయాలని, ఆయన సినిమాలను విడుదల కానివ్వొద్దు అంటూ డిమాండ్ వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో వర్మ ‘ఆఫీసర్’ చిత్రం పబ్లిసిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే వర్మ ఇటీవల ప్రకటించిన అఖిల్ మూవీ క్యాన్సిల్ అయ్యిందని, ఆఫీసర్ కోసమే కిందా మీదా పడుతున్న వర్మ ఇక అఖిల్‌తో సినిమా ఏం చేయలేస్తాడు అనే టాక్ వినిపిస్తుంది.
తాజాగా మీడియాలో వస్తున్న వార్తలపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. తాను అఖిల్ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నట్లుగా మీకు ఎవరు చెప్పారు. ప్రస్తుతం ఆఫీసర్ సినిమా ట్రైలర్‌ను రెడీ చేస్తున్నాను. ఇదే సమయంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఆఫీసర్‌ను భారీ ఎత్తున విడుదల చేసి, ఆ తర్వాత వెంటనే అఖిల్ మూవీని ప్రారంభిస్తాను అంటూ వర్మ ప్రకటించాడు. భారీ ఎత్తున ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. అఖిల్‌తో ఒక విభిన్నమైన కథాంశంతో సినిమాను చేస్తున్నట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు. అయితే అక్కినేని ఫ్యామిలీ వర్మ దర్శకత్వంలో సినిమాకు ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.