కోరనా కాలం.. లాక్ డౌన్ అమలులో ఉండటంతో జనాలంతా గత రెండున్నర నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులతో ఈ మధ్య మళ్లీ జనాలు రోడ్లమీదకి వారి వారి దైనందిన జీవితంలో ఉరకలు, పరుగులు ప్రారంభమయ్యాయి. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వలస కూలీలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణం చేసేందుకు అనుమతి లభించింది. దీంతో ప్రజలు సొంత వాహనాల్లో, అద్దె వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఇలా రాజస్థాన్ నుంచి బీహార్ కు స్కార్పియో వాహనంలో ప్రయాణం చేస్తుండగా లక్నో… ప్రయాగ్ రాజ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న 9 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.