Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచ మంతా ఇప్పుడు మాట్లాడుతోంది కృత్రిమ మేథస్సు గురించే. కంప్యూటర్ విప్లవం తర్వాత ప్రపంచ గతిని మార్చగలదని భావిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై అభివృద్ధి చెందిన దేశాల్లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. పలు దేశాధినేతలు కృత్రిమ మేథస్సు పై సానుకూల భావం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలోఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతను రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు.
ప్రపంచ భవిష్యత్తు కృత్రిమ మేథస్సు మీదే ఆధారపడి ఉందని, మానవాళి మొత్తం దాని ఆధారంగానే పనిచేస్తుందని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో పట్టు సాధించిన దేశమే భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలుతుందని అభిప్రాయపడ్డారు. విద్యాసంవత్సరం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో పుతిన్ మాట్లాడారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సాధించిన పరిజ్ఞానాన్ని అన్నిదేశాలు ఒకదానితో ఒకటి పంచుకోవాలని పుతిన్ కోరారు. కొత్తగా వచ్చే ఈ టెక్నాలజీలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో, అన్ని సమస్యలు కూడా ఉంటాయని, వాటిని ముందుగా ఎవరూ ఊహించలేరని పుతిన్ విశ్లేషించారు. అణుపరిజ్ఞానాన్ని పంచుకున్నట్టుగానే ఆయా దేశాలు కృత్రిమ మేధస్సు సమాచారాన్ని కూడా ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ఈ రంగంలో ప్రపంచం మరింత ముందుకు పోగలదని పుతిన్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు: