గవర్నర్‌ సాయంతో రాబోతున్న ‘సాక్ష్యం’

‘Saakshyam’ Get U/A Certificate in Governor Support

బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన ‘సాక్ష్యం’ చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుండి షాక్‌ ఎదురైన విషయం తెల్సిందే. విడుదలకు వారం ముందే సెన్సార్‌ ముందుకు వెళ్లిన చిత్రానికి జంతు సంరక్షణ ఆఫీస్‌ నుండి సర్టిఫికెట్‌ తీసుకు రాలేదు అని, ఈ చిత్రంలో వాడిన జంతువుల గురించిన సర్టిఫికెట్‌ ఇస్తేనే సెన్సార్‌ పూర్తి చేస్తాం అంటూ సెన్సార్‌ బోర్డు వారు అడ్డు చెప్పారు. విడుదల తేదీ దగ్గర పడుతుంది, ఈ సమయంలో ఆ సర్టిఫికెట్స్‌ అంటే ఆలస్యం అయ్యేలా ఉంది. దాంతో అంతా కూడా సాక్ష్యం విడుదల ఆలస్యం అవుతుందని భావించారు. కాని మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు ఈ విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులకు సాయంగా నిలిచారు.

గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు సాయంతో చిత్రంకు సంబంధించిన అడ్డంకులు తొలగి పోయాయి. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు సభ్యులు యూ/ఎ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉంటుందని టీజర్‌ మరియు ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ స్టైలిష్‌ లుక్‌ మరియు పూజా హెగ్డే గ్లామర్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ ఏమాత్రం అనుమానాలు లేకుండా ఈనెల 27న విడుదల కాబోతుంది. సినీ ప్రముఖుల నుండి విశ్లేషకులు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. దాంతో ఈ చిత్రంపై మరింతగా అంచనాలున్నాయి.