సెప్టెంబ‌రు 9 స‌చిన్ కు ఎంతో ప్ర‌త్యేకం

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

sachin tendulkar first century in odi on september 9

స‌చిన్ టెండూల్క‌ర్ అభిమానులు సెప్టెంబ‌రు 9 ని ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు. ఈ రోజే స‌చిన్ అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్లో తొలి సెంచ‌రీ చేయ‌టం ద్వారా త‌న ప‌రుగుల రికార్డు మొద‌లుపెట్టారు. 1994 సెప్టెంబ‌రు 9న తొలి సెంచ‌రీ చేసిన స‌చిన్ 2013లో రిటైర‌య్యే లోపు రికార్డు స్థాయిలో 49 సెంచ‌రీలు చేశారు. అయితే ఇప్ప‌టి క్రికెట‌ర్ల‌లా క్రికెట్లోకి అడుగు పెట్టిన తొలిరోజుల్లోనే స‌చిన్ సెంచ‌రీ చేయ‌లేదు. ఆయ‌న తొలి సెంచ‌రీ చేయ‌టానికి ఐదేళ్లు ప‌ట్టిందంటే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు.

త‌న కెరీర్లో తొలి వ‌న్డే మ్యాచ్‌ను స‌చిన్ 1989లో ఆడాడు. ఐదేళ్ల త‌రువాత 1994లో త‌న 78వ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 130 బంతుల్లో 110 ప‌రుగులుచేయ‌టం ద్వారా స‌చిన్ తొలి సెంచ‌రీ న‌మోదుచేశాడు. రెండు సిక్సులు, నాలుగు ఫోర్లు చేయ‌టం ద్వారా స‌చిన్ సెంచ‌రీ సాధించాడు. ఇక ఆ త‌ర్వాత ఆయ‌న సెంచ‌రీల ప్రయాణం ఎక్క‌డా ఆగ‌లేదు. 24 ఏళ్ల కెరీర్ లో రికార్డు స్థాయిలో సెంచ‌రీలు చేసిన స‌చిన్ భార‌త క్రికెట్ లోనే కాదు…అంత‌ర్జాతీయ క్రికెట్ లోనూ ఎవరూ ఊహించ‌ని ఎత్తుల‌కు ఎదిగాడు.

ప్ర‌స్తుతం ఈ రికార్డును బ్రేక్ చేసే క్రికెట‌ర్ క‌నిపించ‌టం లేదు. స‌చిన్ స్థాయికి చేర‌టం ఇప్పుడున్న క్రికెట‌ర్ల‌కు అసాధ్యం. దానికి తోడు ఇప్ప‌టి వేగానికి త‌గ్గ‌ట్టుగా క్రికెట‌ర్లు వ‌న్డేల క‌న్నా టీ20లు ఎక్కువ‌గా ఆడుతున్నారు. అందుకే స‌చిన్ సాధించిన 49 సెంచ‌రీల రికార్డు కొన్నేళ్ల వ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్లో చెరిగిపోదు. అటు ఈ రోజు ప్ర‌త్యేక‌త‌ను ఐసీసీ సైతం త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో గుర్తుచేసింది. స‌చిన్ త‌న 78వ మ్యాచ్ లో తొలిసెంచ‌రీ చేశాడ‌ని ట్వీట్ చేసింది. స‌చిన్ కూడా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ తీపి జ్ఞాప‌కాన్ని గుర్తుచేసుకున్నాడు. స‌మ‌యం వెళ్లిపోతున్నా…మెమ‌రీలు మాత్రం ఎప్ప‌టికీ గుర్తుండి పోతాయ‌ని స‌చిన్ ట్వీట్ చేశాడు. ఈ తీపిగుర్తును పోస్ట్ చేసినందుకు ఐసీసీకి థ్యాంక్స్ చెప్పాడు.


మరిన్ని వార్తలు:

40 ఏళ్లు వ‌చ్చిన త‌రువాతే రిటైర్మెంట్

నా ఇద్ద‌రు కూతుళ్ల‌లాగే నువ్వూ…

అర్జున ర‌ణ‌తుంగ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు