భారతదేశం కర్మభూమి.. దీంతో మూఢనమ్మకాలు కాస్తజాస్తే. అందులో భాగంగా ఏమైన విపత్తు సమాజానికి వచ్చిందంటే..అందుకు సంబంధించిన నాటు వైద్యాన్ని.. విరుగుడుకోసం ఆలోచిస్తంటుంది జనం. అయితే తాజాగా కరోనాను అణచివేసేందుకు జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో శాంతి పూజల నిర్వహించారు. శాంతి పూజల పేరుతో 400 గొర్రెలను బలి ఇవ్వడం పెద్ద కలకలం రేపుతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో వణికిపోతున్న విషయం తెలిసిందే. అయితే అందుకు మందు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు బిజీగా ఉన్నారు.
ఇదే సమయంలో జార్ఖండ్ లో 400 గొర్రెలను బలి ఇవ్వడం చర్చకు దారితీస్తుంది. చంద్వారా బ్లాక్ పరిధిలో గల ఉర్వాన్ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ఈ ఘటన జరిగింది. కరోనాను శాంతింపచేయడానికి అంటూ పూజలు నిర్వహించిన స్థానికులు పెద్దఎత్తున కోళ్లతో పాటు 400 గొర్రెలను బలిచ్చారు. ఇలా చేస్తే కరోనా నుంచి తమ గ్రామానికి విముక్తి కలుగుతుంది అని వారి నమ్మకంగా చెప్తున్నారు. కాగా ఈ కార్యక్రంలో భౌతిక దూరం నియమాన్ని కూడా ఉల్లంఘించి సాగినట్లు తెలుస్తోంది. ఎవరి నమ్మకం వాళ్ళది కావొచ్చు.. కానీ.. ఇలా బలి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.