అప్పుడు ఇష్టపడి, ఇప్పుడు ఆసక్తి లేదంటుంది

Sai Pallavi Not Attending To Kanam Movie Promotions In Telugu And Tamil

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో వచ్చి తెలుగు వారి గుండెల్లో కూడా నిలిచి పోయింది. సాయి పల్లవి హీరోయిన్‌గా ఇటీవలే వచ్చిన ‘ఎంసీఎ’ చిత్రం కూడా మంచి విజయాన్ని సొతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవికి వరుసగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ చిత్రాలు సక్సెస్‌ కాకముందే సాయి పల్లవి కమిట్‌ అయిన చిత్రం ‘కణం’. తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఆ చిత్రంను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. 

తెలుగు మరియు తమిళంలో ఒక ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకు రావడంతో ఇక విడుదల ఆగదని అంతా భావించారు. కాని ‘కణం’ విడుదల అవ్వడం సాయి పల్లవికి ఇష్టం లేదని తెలుస్తోంది. కూతురుకు తల్లిగా సాయి పల్లవి నటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం స్టార్‌ హీరోలకు జోడీగా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో ఇలా తల్లిగా నటించడం వల్ల కెరీర్‌ పరంగా నష్టం ఏర్పడుతుందని సాయి పల్లవి ఆందోళన చెందుతుంది.

మొదట మంచి పాత్ర, ఛాలెంజింగ్‌ రోల్‌ అంటూ కమిట్‌ అయిన సాయి పల్లవి ఇప్పుడు ఆ చిత్రం విడుదల కావద్దని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ప్రమోషన్‌కు రమ్మని కోరగా ఆమె నో అంటుందట. సాయి పల్లవిపై ప్రస్తుతం నిర్మాత ఆగ్రహంగా ఉన్నాడు.