అక్కినేని ఫాన్స్ కి సమంత క్లాస్.

samantha fires on akkineni fans about samantha bikini photo

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఫ్యాన్ ఫాలోయింగ్ సెలెబ్రెటీలకు పెద్ద అసెట్ అనుకుంటారు. ఒక్కోసారి అది పెద్ద అడ్డంకి కూడా. ఈ విషయం సినిమా స్టార్స్ ఇళ్ల నుంచి వచ్చి ఏదైనా ట్రై చేద్దాం అనుకునే ఆడవాళ్ళకు బాగా అనుభవం. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల అప్పట్లో హీరోయిన్ గా చేయకపోవడానికి ఇదే పెద్ద కారణం. పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వస్తోంది. స్టార్స్ కూతుళ్లు కూడా హీరోయిన్స్ అవుతున్నారు. కమల్ కుమార్తెలు శృతి, అక్షర, మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి లాంటి వాళ్ళు ఇందుకు పెద్ద ఉదాహరణ. కూతుళ్లు సరే … స్టార్స్ ఇంటికి కోడలిగా వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి ? ఈ విషయంలో అక్కినేని ఇంటి కోడలిగా వచ్చిన సమంతకి రూల్స్ చెప్పబోయిన అభిమానులకు పెద్ద షాక్ తగిలింది.

samanth bikini


సమంత నిన్న బికినీ ధరించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్కినేని ఇంటి కోడలు అయ్యాక కూడా ఇలాంటి డ్రెస్ లు ఏంటని అభిమానులు కామెంట్స్ పెట్టారు. కొద్ది మంది సమంతను సపోర్ట్ చేసినప్పటికీ ఎక్కువ మంది సమంత డ్రెస్సింగ్ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అనధికార రూల్ బుక్ మీద సమంత ఘాటుగా రిప్లై ఇచ్చింది. మీ రూల్స్ మీరు రాసుకోండి , నా రూల్స్ నేను రాసుకుంటా అని తేల్చి చెప్పింది. సమంత కొత్త రూల్ బుక్ తో అక్కినేని ఫాన్స్ షాకులో వున్నారు. సమంత మీద రియాక్ట్ కాలేక , అలా చూస్తూ ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో నాగ్ అయినా జోక్యం చేసుకుని కాస్త ఊరడింపు మాటలు ఏదైనా చెబుతారని ఎదురు చూస్తున్నారు. అయినా అక్కినేని ఫాన్స్ ఆశ పడడమే కానీ ముద్దుల కోడలు మీద నాగ్ ఈగ కూడా వాలనిచ్చేలా లేరట.