సమంత పక్కన్న హీరో చెల్లి.. ఎవరో తెలుసా?

samantha-with-rana-sister-malavika

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మీరు పైన చూస్తున్న ఫొటోలో సమంత పక్కన ఉన్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా.. ఈమె ఒక స్టార్‌ హీరో చెల్లెలు, ఒక స్టార్‌ నిర్మాత కూతురు. సినిమా లెజెండ్‌ మనవరాలు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య. ఇప్పుడు కూడా గుర్తు పట్టలేక పోయారా… ఈమె మరెవ్వరో కాదు దగ్గుబాటి వారి ఇంటి ఆడపడుచు. అవును మీరు ఇప్పుడు అనుకుంటున్నది నిజమే. ఈమె ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కూతురు, హీరో రానా చెల్లెలు, రామానాయుడు మనవరాలు. ఈమెకు అక్కినేని నాగచైతన్య వరుసకు బావ అవుతాడు. అంటే మేనత్త కొడుకు నాగచైతన్య అన్నమాట. తాజాగా నాగచైతన్య, సమంతలు వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. గత నెలలో జరిగిన వివాహంకు తాజాగా చెన్నైలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయడం జరిగింది.

 

దగ్గుబాటి వారి ఫ్యామిలీ సభ్యులు ఈ పెళ్లి రిసెప్షన్‌లో సందడి చేశారు. ఇటీవలే వివాహం అయిన రానా చెల్లి మాళవిక రిసెప్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్తతో కొంత కాలం క్రితం మాళవికకు వివాహం అయిన విషయం తెల్సిందే. సినిమా పరిశ్రమకు మాళవిక చాలా దూరంగా ఉంటూ వచ్చింది. రానా చెల్లి అంటే ఏ ఒక్కరు కూడా గుర్తు పట్టలేరు. ఎందుకంటే సినిమా కార్యక్రమాలకు మరియు ఇతరత్ర వేడుకలకు పబ్‌లకు, క్లబ్‌లకు ఈమె దూరంగా ఉంటూ వచ్చింది. అందుకే ఈమె ఎక్కువగా మీడియాలో నోటెడ్‌ కాలేదు. ఈమెను ఎవరు కూడా గుర్తు పట్టలేరు. తాజాగా సమంతతో కలిసి ఇలా ఫొటోకు ఫోజు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఈమె ఎవరు అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు తెలిసింది కదా.. ఈమె రానా చెల్లి మాళవిక దగ్గుబాటి.