సత్యదేవ్ “కృష్ణమ్మ” 3 రోజుల వసూళ్లు … ఎంతో తెలుసా ..!

Satyadev's "Krishnamma" 3 days collections ... do you know much ..!
Satyadev's "Krishnamma" 3 days collections ... do you know much ..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కృష్ణమ్మ. ఈ మూవీ మే 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి వచ్చింది. వి వి గోపాల కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో అర్చన, కృష్ణ బురుగుల, అతిరా రాజ్, లక్ష్మణ్ మీసాల కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన వసూళ్ల వివరాలని మేకర్స్ తాజాగా వెల్లడించారు.

Satyadev's "Krishnamma" 3 days collections ... do you know much ..!
Satyadev’s “Krishnamma” 3 days collections … do you know much ..!

ఈ మూవీ మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లని రాబట్టగా, మూడో రోజు కూడా అదే తరహాలో కాస్త ఎక్కువ వసూళ్లని సాధించింది. ఈ మూవీ మూడు రోజుల్లో 3.6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లని రాబట్టడం జరిగింది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ మూవీ కి కాల భైరవ సంగీతం అందించారు.