సౌత్‌లో మొన్నటి వరకు భారీ చిత్రాల్లో, స్టార్ హీరోలకు జోడీగా నటించిన ముద్దుగుమ్మ కాజల్ ప్రస్తుతం అవకాశాల కోసం వెదుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టార్ హీరోలు ఈమెకు ఛాన్స్ ఇవ్వక పోవడంతో చిన్న హీరోలతో జత కట్టేందుకు సైతం సిద్దం అవుతుంది. ఇటీవలే ఈ అమ్మడు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటించేందుకు కమిట్ అయిన విషయం తెల్సిందే. తాజాగా ఈమె మరో చిన్న హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిన్న హీరోతో భారీ పారితోషికం ఆఫర్ రావడం వల్ల కాజల్ నటిస్తుందని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో కాజల్ అగర్వాల్ తాజాగా మీడియా ముందు తనకు కథ నచ్చడంతో కమిట్ అయ్యాను అంటూ కవరింగ్ ఇస్తుంది.
శర్వానంద్‌తో చేస్తున్న సినిమాతో పాటు తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. ప్రస్తుత ఆమె మార్కెట్‌కు డబుల్ పారితోషికంను నిర్మాతలు ఆఫర్ చేయడం వల్లే ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ఆ విషయం అందరికి తెల్సిందే. అయినా కూడా కాజల్ తేజ తనకు కథ చెప్పినప్పుడు పారితోషికంను పక్కకు పెట్టి తాను మాత్రమే ఆ పాత్రను చేయాలని కోరుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తేజ తనకు గురువుతో సమానం, ఆ కారణంగానే తాను ఆయన సినిమాలో చేయాలని కోరుకుంటున్నాను. తేజ గారి దర్శకత్వంలో ఇటీవల చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుని నాకు మంచి పేరు తెచ్చింది. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాను అంటూ బెల్లంకొండ మూవీ గురించి చెబుతూ వస్తుంది. పారితోషికం వల్లే తాను ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను ఈ అమ్మడు కొట్టి పారేస్తోంది.