హాస్పిటల్‌ పాలైన అర్జున్‌రెడ్డి హీరోయిన్‌

shalini pandey admit into hospital due to high fever

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో ప్రస్తుతం చాలా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు షాలిని పాండే. ఈమె మొదటి సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. కారణంగా ఈమె మొదటి సినిమా అర్జున్‌రెడ్డి అవ్వడం. అవును అర్జున్‌రెడ్డి సినిమాలో నటించిన షాలిని పాండే ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. ఈ అమ్మడు ప్రస్తుతం వరుసగా సినిమాలు ఒప్పుకోవడంతో పాటు, పలు షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్‌కు హాజరు అవుతుంది. 




తాజాగా నెల్లూరు జిల్లాలో ఒక షోరూంను ప్రారంభించేందుకు షాలిని పాండే అక్కడకు వెళ్లింది. భారీ జనాల మద్య షోరూం ప్రారంభోత్సం జరిగింది. అంతా సాఫీగా సాగుతున్న నేపథ్యంలో హఠాత్తుగా షాలిని పాండే కళ్లు తిరిగి పడిపోబోయింది. దాంతో ఆమె సిబ్బంది మరియు షోరూం సిబ్బంది ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స అందించిన తర్వాత ఆమెను హైదరాబాద్‌కు తీసుకు వెళ్లనున్నట్లుగా షాపింగ్‌ మాల్‌ యాజమాన్యం ప్రకటించింది. ఆమెకు స్వల్ప అస్వస్థతే అని, ఎలాంటి ప్రమాదం లేదని వైధ్యులు తెలియజేశారు.



మరిన్ని వార్తలు:

సునీల్ తో త్రివిక్రమ్ సినిమా…

జైలవకుశ సెన్సార్ టాక్ వింటే పూనకాలే.

పెళ్లికి ఒకే ఒక్క స్టార్‌ హీరోను ఆహ్వానించనున్న చైతూ

హాస్పిటల్‌ పాలైన అర్జున్‌రెడ్డి హీరోయిన్‌ - Telugu Bullet