Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని హీరోగా ‘చిత్రలహరి’ అనే చిత్రం తెరకెక్కాల్సి ఉంది. కాని నాని బిజీ షెడ్యూల్ మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమాను వదిలేశాడు. నాని వదిలేసిన ‘చిత్రలహరి’ చిత్రాన్ని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేయబోతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘చిత్రలహరి’ చిత్రాన్ని ఇంకా ఏ హీరో కన్ఫర్మ్ కాలేదని, కొత్త హీరోతో దర్శకుడు కిషోర్ తిరుమల చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ మొదట ఓకే చెప్పినా కూడా ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత అంటే ఈ సంవత్సరం చివర్లో సినిమాను మొదలు పెడదాం అంటూ దర్శకుడితో చెప్పడంతో ఆయన మరో హీరోతో ఈ చిత్రాన్ని చేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఇటీవలే ఈ కథను శర్వానంద్‌కు వినిపించడం, ఆయన వెంటనే ఓకే చెప్పడం జరిగిందని, సమ్మర్లోనే సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు శర్వానంద్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చిత్రలహరి చిత్రం నాని నుండి తేజూకు, ఇప్పుడు తేజూ నుండి శర్వానందుకు వెళ్లింది. శర్వా అయిన ఈ చిత్రాన్ని చేస్తాడా లేక కిషోర్ మరో హీరోను చూసుకోవాల్సిందేనా చూడాలి.