గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ మంచి పేరును సొంతం చేసుకున్న సింగర్ సునీత తన కూతురును కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతుంది. తన కూతురును కూడా గాయనిని చేసిన సునీత తాజాగా ఒక పాట ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందు ఉంచుతోంది. సింగర్ సునీతకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. తన కూతురు పేరు శ్రియ గోపరాజును కూడా సింగర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. తన ఫస్ట్ సాంగ్ గుర్తుండిపోయేలా ఉండాలని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణితో చెప్పగా ఆయన ‘సవ్యపాచి’ చిత్రంలో పాటను పాడడానికి ఒక అవకాశం ఇచ్చాడు.
సునీత ఇటీవలె తన కూతురు, కీరవాణిలతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొదట్లో తన కూతురు చాలా టెన్షన్ పడిరదని, కీరవాణి గారు ధైర్యం చెప్పి ఒక పాటను పాడే అవకాశం ఇచ్చారని చెప్పింది. ఫస్ట్ రికార్డింగ్ శ్రియకు ఎప్పటికి గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను అంటూ సునీత పోస్ట్ చేసింది. దాంతో అందరికి ఒక క్లారిటీ వచ్చింది. అయితే శ్రియ గాత్రం సునీత కంటే భిన్నంగా ఉంటుందట. వెస్ట్రన్ స్టయిల్‌లో శ్రియ గాత్రం ఉంటుందని కీరవాణి చెప్పినట్టు ఈ చిత్ర యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతోంది. నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రం నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.