Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడెప్పుడు డ్రగ్స్ వ్యవహారంలో స్పందిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అంతా ఆశించినట్లుగా వర్మ స్పందించాడు. డ్రగ్స్ కేసును డీల్ చేస్తున్న అకున్ సబర్వాల్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శలు చేయడంతో అందరి దృష్టి ఒక్కసారిగా వర్మపైకి షిప్ట్ అయ్యింది. వర్మ కామెంట్స్‌పై సిట్ ఉన్నతాధికారి చంద్రవదన్ కూడా స్పందించారు. తమకు అందరు సమానమే అని, ఏ ఒక్కరిని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయమై మా ప్రెసిడెంట్ వర్మ కాస్త ఘాటుగా స్పందిస్తూ, వర్మకు బుద్ది చెప్పే ప్రయత్నం చేశాడు.
వర్మ సినిమాలు తీసి పబ్లిసిటీ తెచ్చుకోవాలని, ఇలాంటి సున్నితమైన అంశాలపై కామెంట్స్ చేసి పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చవద్దు అంటూ శివాజీరాజా ప్రెస్‌మీట్ పెట్టి మరీ సుతిమెత్తగా హెచ్చరించాడు. ఇంకా శివాజీ రాజా మాట్లాడుతూ.. ఇప్పుడే నిద్రలేచిన వర్మ ఇంగ్లీష్ వచ్చ కదా అని ఏది పడితే అది మాట్లాడవద్దని, సమస్యను మరింత పెంచే ప్రయత్నం చేయవద్దని, పోలీసు ఉన్నతాధికారులకు ఏం చేయాలో తెలుసు అని ఆయన అన్నారు. వర్మ దీనిపై ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
మరిన్ని వార్తలు