Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : విక్రమ్, తమన్నా
నిర్మాత : మూవింగ్ ఫ్రేమ్
దర్శకత్వం : విజయ్ చందర్
సినిమాటోగ్రఫీ: ఎమ్. సుకుమార్
ఎడిటర్ : రూబెన్
మ్యూజిక్ : తమన్
ఒకప్పుడు తెలుగులోనూ మంచి మార్కెట్ వున్న హీరో విక్రమ్. అపరిచితుడు తో తెలుగులోనూ మార్కెట్ పెంచుకున్న అతను “ఐ “ సినిమా తరువాత దాన్ని పూర్తిగా కోల్పోయాడు. తమిళంలో ఓ మోస్తరు హిట్ అయిన సినిమాని నమ్ముకుని పూర్వ వైభవం కోసం తెలుగులో స్కెచ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ సినిమా ఎలా వుందో చూద్దామా…
కథ…
ఓ గ్యారేజ్ లో పనిచేసే నలుగురు స్నేహితులు. వీరిలో జట్టుకి నాయకుడుగా వుండే జీవా ( విక్రమ్ )ఐడియాలు చూసి అతన్ని స్కెచ్ అని పిలుస్తుంటారు. ఈ నలుగురు లోన్ కట్టని వెహికల్ యజమానులు దగ్గర మైండ్ గేమ్ తో మొండి బకాయిలు కూడా వసూలు చేస్తుంటారు. ఆ క్రమంలో హీరోయిన్ ని కలిసిన హీరో ఆమెని ప్రేమలోకి దింపుతాడు. అదే సమయంలో ఓ కారు విషయంలో ఈ గ్యాంగ్ చేసిన పనితో విలన్ వీరిపై కక్ష కడతాడు. అటు ఆ విలన్ ని వేటాడడానికి కొత్తగా వచ్చిన పోలీస్ అధికారి కన్ను కూడా ఈ నలుగురి మీద పడుతుంది. ఇంతలో ఆ గ్యాంగ్ లోని జీవా ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా మాయం అయిపోతుంటారు. దీని వెనుక ఎవరున్నారు , చివరకు ఏమి అవుతుంది అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ…
ఈ సినిమాని కొత్తగా విశ్లేషించేందుకు ఏమీ లేదు. పక్కా మాస్ మసాలా సినిమా. అయితే చిన్నపాటి మెసేజ్. ప్రీ ఇంటర్వెల్ , ప్రీ క్లయిమాక్స్ ఎపిసోడ్స్ లో మలుపులు, విక్రమ్ నటన ఈ సినిమాని నిలబెట్టాయి. అదే సమయంలో హీరోయిన్ తో లవ్ ఎపిసోడ్ ఎన్నో సినిమాల్లో చూసి చూసి అరిగిపోయిందే. పైగా హీరోయిన్ పాత్ర కేవలం పాటలకే వస్తున్నట్టు ఉంటుంది. ఆ పాటలు సినిమా మూడ్ పాడు చేయడానికి వస్తాయి అన్నట్టు సాగింది స్క్రీన్ ప్లే. అయితే విక్రమ్ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ , ట్విస్ట్స్ కలిపి సినిమా మరీ నాసిరకం అనిపించకుండా చేస్తాయి. థమన్ మ్యూజిక్ ఇటు పాటల్లో , అటు బ్యాక్ గ్రౌండ్ లో కూడా బాగుంది. అంతకు మించి ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు.