Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ స్కూళ్లు, టాలీవుడ్ చుట్టూ తిరిగిన డ్రగ్స్ కేసు.. ఇప్పుడు కేబినెట్ దగ్గర ల్యాండైంది. కేబినెట్ లో కొందరు మంత్రులు తమ విచారణకు అడ్డొస్తున్నారని ఏకంగా సిట్ చీఫ్ అకున్ సభర్వాల్ ఫిర్యాదు చేయడంతో సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. సదరు మంత్రుల్ని పిలిచి ఫుల్లుగా క్లాస్ పీకారట. బ్రాండ్ హైదరాబాద్ ముఖ్యమని, అదిపోతే మనమందరం ఏం చేయలేమని వ్యాఖ్యానించారట.
డ్రగ్స్ కేసును మొదట్నుంచీ అకున్ సభర్వాల్ చూస్తున్నారు. ఆయన దూకుడుగా వెళ్లి, నిజాయితీగా వ్యవహరించి పెద్దవాళ్లందరి జాతకాలు బయటకు తీశారు. ఆధారాలతో సహా దొరికిపోవడంతో టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వ పెద్దల్ని ఆశ్రయించారు. దీంతో కొందరు మంత్రులు విచారణలో ఒత్తిడి తెచ్చారు. ఈ గొడవంతా ఎందుకని అకున్ సభర్వాల్ లీవ్ లో వెళ్లిపోయారు.
దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అత్యవసరంగా సీనియర్లతో భేటీ అయిన కేసీఆర్.. అకున్ ను వెనక్కి పిలిచారు. పనిలోపనిగా ఆయనతో ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అప్పుడే మంత్రుల ఒత్తిడి గురించి కేసీఆర్ కు తెలిసింది. అందుకే అకున్ ను వెనక్కి రప్పించి, సర్వాధికారాలు అప్పగించారు. మంత్రుల్ని కూడా జోక్యం చేసుకోవద్దని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని వార్తలు: