Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్ అయిన దగ్గర్నుంచి తన మాటే నెగ్గించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆటకు దూరమైనా బోర్డు వ్యవహారాల్లో మాత్రం గంగూలీకి పట్టు ఉంది. అలాంటి దాదా కూడా రవిశాస్త్రి వ్యూహాల ముందు తేలిపోయాడు. రవితో తలపడి ఓడిపోవడం గంగూలీ అభిమానులకు కూడా నచ్చలేదు. గంగూలీ సరైన వ్యూహాలు రచించలేదని వారు అభిప్రాయపడుతున్నారు.
అసలు అడ్వైజరీ కమిటీనే తిట్టిన రవిశాస్త్రిని కోచ్ గా ఎందుకు ఎంపిక చేశారని వారు మండిపడుతున్నారు. ప్లేయర్ గా రవిశాస్త్రి సెకండ్ గ్రేడ్ ప్లేయరైనా.. అతడేదో బ్రహ్మాండం బద్దలు కొట్టినట్లు మాట్లాడటం అందరికీ విడ్డూరంగా ఉంది. ఇంతవరకూ ఏ కోచ్ విషయంలోనూ ఎదురవని ఒత్తిడి.. రవిశాస్త్రి కారణంగా బోర్డు భరించాల్సి వస్తోంది. అసలు కోహ్లీ, రవిశాస్త్రి లేకపోతే టీమ్ లేదన్నట్లుగా పరిస్థితి విషమించడం ఏమాత్రం మంచిది కాదు.
మరి బీసీసీఐ పాలకుల కమిటీ కూడా ఎందుకు ఈ వికృత క్రీడకు తల ఊపిందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. రవిశాస్త్రి కంటే కుంబ్లే బెస్ట్ కోచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా సంజయ్ బంగర్, భరత్ అరుణ్ లు ఫెయిల్యూర్ ప్లేయర్స్. కానీ ద్రవిడ్, జహీర్ సమర్థత గురించి సెకండ్ గ్రేడ్ ప్లేయర్ రవిశాస్త్రి మాట్లాడటంపై అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మరిన్ని వార్తలు