Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమలో కూడా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఉందని, అది ఇప్పటిది కాదని, కొన్ని దశాబ్దాలుగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం సినిమా పరిశ్రమలో కొనసాగుతూ వస్తుందని కొందరు సీనియర్ మరియు జూనియర్ హీరోయిన్స్ ఈ మద్య కాలంలో పదే పదే చెబుతూ వస్తున్న విషయం తెల్సిందే. అయితే కొందరు హీరోయిన్స్ మరియు సినిమా వారు మాత్రం వారి అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల మాట్లాడుతూ టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అనేదే లేదని, తనకు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదని, కొందరు కావాలని ఇండస్ట్రీపై అబాండాలు వేస్తున్నారంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రకుల్ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి మరియు మాధవిలతలు విడి విడిగా స్పందించారు. రకుల్ ఒక స్టార్ హీరోయిన్ అవ్వడంతో గతంలో పడ్డ ఇబ్బందులను, ఎదుర్కొన్న అవమానాలను మర్చిపోయినట్లుగా ఉందని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. ఇక మాధవిలత కాస్త గట్టిగానే రకుల్‌ను విమర్శించింది. రకుల్ చెప్పేవని అబద్దాలు అని, ఆమెతో పాటు అంతా కూడా ఇండస్ట్రీలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న వారే అని, ఆడది అంటే అంగడి బొమ్మగా ఇండస్ట్రీ వారు చూస్తారని, ముఖ్యంగా కొందరు ప్రముఖ స్టార్స్ చిన్న నటీమనులను నీచంగా చూసే సాంప్రదాయం టాలీవుడ్‌లో ఉందని, అందుకు రకుల్ మినహాయింపు అని తాను భావించడం లేదు అంటూ మాధవిలత చెప్పుకొచ్చింది. మొత్తానికి టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం సీరియస్ అవుతుంది. ఈ వ్యాఖ్యల తీవ్రత మరెంత దూరం వెళ్తుందో చూడాలి.