Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్నాళ్లుగా సినిమా పరిశ్రమకు చెందిన పలువురిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి తనపై మా విధించిన బ్యాన్‌ను ఎత్తి వేయించుకోగలిగింది. త్వరలోనే ఈమెకు మా సభ్యత్వం దక్కుతుందని అంతా భావించారు. ఈమె లైంగికంగా వేదింపులు ఎదుర్కొందంటూ పలువురు మద్దతుగా నిలిచారు. శ్రీరెడ్డికి మహిళ సంఘాల వారు మరియు సినీ పరిశ్రమకు చెందిన పలువురు కూడా తమ మద్దతును తెలపడంతో ఒక్కసారిగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే శ్రీరెడ్డి పిచ్చి పీక్స్‌కు చేరింది. ఆమె ఇంకా కూడా పబ్లిసిటీ కోసం ప్రాకులాడుతూ చిల్లరగా వ్యవహరిస్తూ అందరి విమర్శలకు గురవుతుంది.
ఒంటరిగా పోరాటం చేసిన శ్రీరెడ్డికి ప్రస్తుతం పలువురి మద్దతు లభించింది. అయితే తాజాగా ఆమెకు పవన్ కళ్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించడంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. పవన్ కళ్యాణ్ అన్న అంటూ సంభోదించినందుకు తన చెప్పుతో కొట్టుకోవడం కాకుండా, అత్యంత హీనంగా పవన్ కళ్యాణ్‌ను అవమానించింది. ఒక అమ్మాయి లైంగిక వేదింపులకు గురైందని తెలిసి, పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించడం పవన్ తప్పు అయ్యింది. అందుకు శ్రీరెడ్డి అత్యంత దారుణంగా పవన్‌పై విమర్శలు చేయడం ప్రస్తుతం విమర్శలకు తెర లేపుతుంది. పవన్‌ను విమర్శిస్తే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో ఇంత నీజంగా ప్రవర్తించింది అంటూ శ్రీరెడ్డిపై ఆమెకు మద్దతుగా నిలిచిన వారే విమర్శలు చేస్తున్నారు. శ్రీరెడ్డి మానసిక పరిస్థితి బాగున్నట్లుగా లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి శ్రీరెడ్డి మెగా ఫ్యాన్స్‌కు టార్గెట్ అయ్యింది.