Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మరణం తర్వాత విధిగా నిర్వర్తించవలసిన కొన్ని కార్యక్రమాలను శ్రీదేవి కుటుంబ సభ్యులు సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తున్నారు. దక్షిణాది హిందూ సంప్రదాయం ప్రకారం తొలుత శ్రీదేవి అస్థికలను ఆమె భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీకపూర్, ఖుషికపూర్ రామేశ్వరం వద్ద ఉన్న బంగాళాఖాతంలో నిమజ్జనం చేశారు. శ్రీదేవి చనిపోయి 13 రోజులు గడవడంతో గురువారం ఆమె అస్థికల్లో కొంత భాగాన్ని ఆమె కుటుంబం హరిద్వార్ లో నిమజ్జనం చేసింది. బోనీకపూర్, ఆయన తమ్ముడు అనీల్ కపూర్, డిజైనర్ మనీష్ మల్హోత్రా, అమర్ సింగ్, ఇతర కుటుంబసభ్యులు కలిసి ఈ తంతు పూర్తిచేశారు. వీఐపీ ఘాట్ లో శ్రీదేవి ఆత్మశాంతి కోసం పూజలు నిర్వహించారు.