Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నో అద్బుతమైన కథలు రాసి, పలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ‘బాహుబలి’ సినిమాకు కథను అందించారు. రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించినా దర్శకుడిగా మాత్రం ‘రాజన్న’తో సక్సెస్ కాలేక పోయాడు. ఇక ఆయన తాజాగా ‘శ్రీవల్లి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు దర్శకుడిగా వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై రాని ఒక అద్బుతమైన కథతో ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా విడుదలకు ముందే దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ఇదో సైన్స్‌ఫిక్సన్ మూవీ అని, అమ్మాయి మనస్సు గురించి ఒక శాస్త్రవేత్త చేసిన ప్రయోగమే ఈ సినిమా అంటూ కథను రివీల్ చేయడం జరిగింది. కథ రివీల్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక సినిమాలో రాజమౌళి వాయిస్ ఓవర్ వచ్చే అయిదు నిమిషాల సీన్స్ సినిమాకే హైలైట్ అంటూ చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ అయిదు నిమిషాలు మిస్ అవ్వొద్దని, ఒక వేళ ఆ అయిదు నిమిషాల సీన్ మిస్ అయితే సినిమా అర్థం కాదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ఇలాంటి వార్తలతో సినిమాపై అంచనాలను, ఆసక్తిని అమాంతం పెంచేస్తున్నారు.