ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి ఆధరణ లభించింది. ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలకృష్ణ గెట్ అప్ అచ్చం రామారావు గారిని పోలి ఉండటం సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో నిజ జీవితంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ల పాత్రలను సినిమా పరిశ్రమకు చెందినా కొంత మంది స్టార్స్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ గారిని ఎప్పుడు అన్నగారని పిలిచే అక్కినేని నాగేశ్వరావు గారి పాత్రకూడా సినిమాలో ఆకట్టుకున్నే విధంగా ఉన్నది. ఈ పాత్రను తన మనవడు సుమంత్ పోషించాడు. సుమంత్ ఆ పాత్రలో అచ్చం నాగేశ్వరావు లాగా కనిపిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన లేటెస్ట్ ప్రోమోలో నాగేశ్వరావు పాత్రలో ఉన్న సుమంత్ ను చూడవచ్చు.
సుమంత్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…. తన తాత పాత్రకు నేను పెద్దగ ఏమి హోం వర్క్ చెయ్యలేదు. మా తాత కు సంబందించిన ఓ ఇంటర్వ్యూ ను చూశాను . అందులో తాత గారు ఎలాగా అవాభావాలు పలికిస్తున్నారు అనేది భాగా గమనించాను. తాత గారి గొంతును కూడా నేను ఇమిటేట్ చెయ్యలేదు. నా ఒరిజినల్ వాయిస్ తో కొంచెం బేస్ పెంచి మాట్లాడను అంతే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభించడం నాకు చాలా సంతోషం గా ఉన్నది. క్రిష్ పై ఉన్న నమ్మకంతోనే తాత గారి పాత్రలో నటించాను. మొదట కొంచెం భయం వేసిన బాలకృష్ణ గారు ఇచ్చిన స్పూర్తితో నాకు కొండంత దైర్యం వచ్చింది అన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9 న విడుదలవుతుంది. ఇప్పటి వరకు సినిమాలో ప్రోమోలో మాత్రమే నన్ను చూశారు ఇకా మీదట సినిమాలో బాలకృష్ణ ప్రక్కన నన్ను పూర్తిగా చూస్తారు అన్నారు.