పిచ్చిరెడ్డి బర్త్ డే వేడుకల్లో సన్నీ లియోన్.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Sunny Leone Dance with Pichi reddy at Hyderabad

సన్నీ లియోన్ ఎవరంటే శృంగార దేవతగా అందరికీ తెలుసు. ఒకప్పుడు పోర్న్ మూవీల్లో నటించిన ఈ అమ్మడు ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. అడపాదడపా రీజినల్ భాష చిత్రాల్లో కూడా కనిపిస్తోంది. అమ్మడి అందాలు చూసేందుకు కుర్రకారు తెగ ఇంటరెస్ట్ చూపిస్తారు. అలాంటి సన్నీ ఈ మధ్య హైదరాబాద్ వచ్చింది. ఓ ప్రైవేట్ పార్టీ లో ఆహుతుల్ని ఉర్రుతలూగించేలా డాన్స్ చేసింది. అమ్మడికి జోడిగా చిందులు వేసింది కుర్రోడు కాదు. 60 ఏళ్ల వ్యక్తి. పేరు పిచ్చిరెడ్డి. ఈయన బర్త్ డే వేడుకల కోసమే సన్నీ దిగివచ్చింది. ఇంతకీ ఈ పిచ్చిరెడ్డి ఎవరనే కదా మీ డౌట్ ? అక్కడికే వస్తున్నాం.



 

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్స్ చేస్తున్న సంస్థల్లో ముఖ్యమైనది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇంఫ్రాస్ట్రుక్చర్స్. ఆ మెగా కృష్ణారెడ్డి దగ్గర బంధువే ఈ పిచ్చిరెడ్డి. పైగా మెగా సంస్థల్లో డైరెక్టర్ కూడా. ఈయన గారి షష్టిపూర్తి వేడుకలు ఇప్పుడు హైదరాబాద్ సెలబ్రిటీ వర్గాల్లో హాట్ టాపిక్. ఓ స్టార్ హోటల్ లో ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో ఆడటానికి ఏకంగా సన్నీ లియోన్ నే పిలిపించారు. డైమండ్ షేప్ ఇంటిలో వుండే ఈ అపర కుబేరుడి బర్త్ డే వేడుకల్లో ఆయన కూడా రెచ్చిపోయాడట. స్వయంగా సన్నీ తో కలిసి డాన్స్ చేసాడట. అయితే ఈ దృశ్యాలు బయటికి రావులే అనుకుంటే వచ్చిన అతిధులు కొందరు సెల్ ఫోన్స్ లో షూట్ చేయడంతో అవి బయటికి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకల్లో పిచ్చిరెడ్డి సతీమణి కట్టిన డ్రెస్ ని పారిస్ నుంచి తెప్పించారట. దాని ఖరీదు ఎంతంటే… ఈ క్లాస్ మెర్సిడెస్ బెంజ్ కార్ అంత అంట.





మరిన్ని వార్తలు:

మోదుగుల యాక్టింగ్ కి టీడీపీ క్యాడర్ షాక్.

సీసీటీవీలో బాలుడి చివ‌రి క్ష‌ణాలు

కొత్త కాపు రాబోతున్నాడు.