మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న సమయంలో తెలంగాణ రెవిన్యూ అధికారులు సెట్‌ను అక్రమంగా నిర్మించారు అంటూ షూటింగ్‌ను అడ్డుకుని, సెట్‌ను కూల్చివేసిన విషయం తెల్సిందే. రెవిన్యూ అధికారులను చిత్ర యూనిట్ సభ్యులు మరో నెల రోజుల సమయం కావాలని రిక్వెస్ట్ చేసినా కూడా ఫలితం దక్కలేదు. దాంతో చిత్రీకరణ వారం రోజుల పాటు నిలిపేసి, వెంటనే కూల్చివేసిన సెట్‌ను మరో చోట పునర్‌నిర్మించి చిత్రీకరణ ప్రారంభించారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత రామ్ చరణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ మరియు తమిళ, మలయాళంలో కూడా విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమితాబచ్చన్‌తో పాటు ఇంకా ప్రముఖులు ఈ చిత్రంలో నటించిన కారణంగా పలు భాషల్లో ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఏఆర్ రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాల్సి ఉన్నా కూడా, కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నాడు. ఆయన స్థానంలో బాలీవుడ్‌కు చెందిన మరో సంగీత దర్శకుడిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈనెలలో చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే లీక్ పోస్టర్స్‌తో సినిమాలో చిరు లుక్ రివీల్ అయ్యింది. ప్రస్తుతం ప్రేక్షకులు టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.